RCB Into Playoffs Ambati Rayudu Comments: RCBని మరోసారి దారుణంగా అవమానించిన రాయుడు.. ఇంత కక్ష ఏంది సామి!

RCBని మరోసారి దారుణంగా అవమానించిన రాయుడు.. ఇంత కక్ష ఏంది సామి!

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​కు చేరుకున్న ఆర్సీబీని మరోసారి టార్గెట్ చేసుకున్నాడు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఆ జట్టును దారుణంగా అవమానించాడు.

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​కు చేరుకున్న ఆర్సీబీని మరోసారి టార్గెట్ చేసుకున్నాడు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఆ జట్టును దారుణంగా అవమానించాడు.

క్రికెట్​లో ఏదైనా సాధ్యమేనని ప్రూవ్ చేసింది ఆర్సీబీ. ఐపీఎల్-2024లో ఎలాంటి ఆశల్లేని స్థితి నుంచి ప్లేఆఫ్స్​కు చేరుకుంది కోహ్లీ టీమ్. ఈ సీజన్ ఫస్టాఫ్​లో వరుసగా 6 మ్యాచుల్లో ఓడింది బెంగళూరు. దీంతో ఆ జట్టు పనైపోయిందని అంతా అనుకున్నారు. కొన్ని వారాల పాటు ఒక్క గెలుపు కూడా లేకపోవడంతో ఆటగాళ్లంతా నిరాశలో కూరుకుపోయారు. ఆ టీమ్ మీద అభిమానులు కూడా ఆశలు వదులుకున్నారు. అయితే సూపర్బ్​గా కమ్​బ్యాక్ ఇచ్చిన డుప్లెసిస్ సేన.. వరుసగా 6 మ్యాచుల్లో భారీ విజయాలు సాధించి ప్లేఆఫ్స్​కు చేరుకుంది. నాకౌట్ మ్యాచ్​లో సీఎస్​కేకు ఝలక్ ఇచ్చి ప్లేఆఫ్స్ గడప తొక్కింది. దీంతో అందరూ ఆ జట్టును ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కానీ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మాత్రం బెంగళూరుపై అసూయను వెళ్లగక్కుతున్నాడు.

సీఎస్​కేపై ఆర్సీబీ విజయాన్ని తట్టుకోలేకపోయాడు రాయుడు. ఆ టీమ్​ను అతడు అవమానించాడు. ఈసారి ఐపీఎల్ కప్పును బెంగళూరు గెలవాలని చెబుతూనే.. ఒకవేళ టైటిల్ నెగ్గకపోతే చెన్నై దగ్గర ఉన్న ట్రోఫీల్లో నుంచి ఒకదాన్ని ఇచ్చేస్తామన్నాడు. సీఎస్​కే ఇచ్చే కప్పుతో ఆర్సీబీ అభిమానులు రోడ్ల మీద పరేడ్ చేయాలంటూ సీరియస్ కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ ఆర్సీబీ ఫ్యాన్స్​ను హర్ట్ చేశాయి. ఈ తరుణంలోనే మరోమారు ఆ జట్టును దారుణంగా అవమానించాడు రాయుడు. సీఎస్​కే లేదు కాబట్టి బెంగళూరుకు కప్పు కొట్టడానికి ఇదే మంచి ఛాన్స్ అన్నాడు. రాయుడి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారాయి.

‘ఆర్సీబీ ఈసారి టైటిల్ కొట్టాలని నేను కోరుకుంటున్నా. ఈసారి వాళ్లకు అవకాశాలు కూడా ఉన్నాయి. సీఎస్​కే రేసులో లేదు కాబట్టి బెంగళూరు కప్పు కొట్టే ఛాన్స్ ఉంది. అందుకే నెక్స్ట్ ఆడే మూడు మ్యాచుల్లోనూ వాళ్లు గెలవాలని కోరుకుంటున్నా’ అని రాయుడు చెప్పుకొచ్చాడు. అయితే అతడి వ్యాఖ్యలపై ఆర్సీబీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. తమ జట్టును ఇలా తీసిపారేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. తమ జట్టు మీద ఇంత కక్ష దేనికి అని ప్రశ్నిస్తున్నారు. సీఎస్​కే లేదు కాబట్టి కప్ కొట్టడం ఏంటి.. చెన్నైని ఓడించే ప్లేఆఫ్స్​కు చేరుకున్నామని అంటున్నారు. ఈసారి కప్ తమదేనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సీఎస్​కే ప్లేఆఫ్స్​లో ఉన్నా.. గ్రూప్ స్టేజ్​లో ఎలాగైతే ఓడించామో అదే రీతిలో ఇంటికి పంపే వాళ్లమంటూ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఆర్సీబీని రాయుడు అవమానించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments