ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ఆధిపత్యం సాధించనుంది. ఈ యేడాది జూన్ నెల నాటికి శాసనమండలి అధ్యక్ష స్థానంతో పాటు ఆధిక్యత కూడా సాధించనుంది.
గత 20 నెలలుగా శాసనమండలిలో ఆధిక్యంలో ఉన్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, అధికార పార్టీకి అడుగడుగునా అడ్డుతగులుతూనే ఉంది. కౌన్సిల్ చైర్మన్ స్థానంతో పాటు మెజారిటీ సభ్యులు ఉండడంతో టీడీపీ అధికార పార్టీ నిర్ణయాలకు అడ్డుతగులుతూనే ఉంది. శాసనసభలో కేవలం 23 సభ్యుల బలంతో 151 మంది ఉన్న అధికార పక్షంతో ఢీ కొట్టలేకపోతున్న టీడీపీ తన రాజకీయ ఎత్తుగడలకు శాసనమండలిని వేదికగా చేసుకుంది. మొత్తం 58 మంది సభ్యులున్న ఈ సభలో 29 మంది సభ్యులతో టీడీపీ అధికార పార్టీకి అడ్డుతగులుతూ వస్తోంది.
Also Read:చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సెలెక్ట్ అయిన కడప కుర్రోడు..
గత యేడాది జనవరిలో మూడురాజధానుల బిల్లు ప్రతిపాదించినపుడు శాసనసభలో అడ్డుకోలేకపోయిన టీడీపీ శాసనమండలిలో గట్టిగానే ప్రతిఘటించింది. నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు శాసనమండలి సందర్శకుల గ్యాలరీలో కూర్చుని చైర్మన్ తో మూడు రాజధానుల బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు ప్రకటింపజేసి పెద్ద వివాదానికి తెరలేపారు.ఈ రాజకీయ ఎత్తుగడలకు చిరాకు చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా శాసనమండలి రద్దు ప్రతిపాదనను శాసనసభలో చేసి కేంద్రానికి పంపించారు. ఈ అంశంపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ లోగా రాజకీయ సమీకరణలు మారి టీడీపీ బలం ఒక్కొక్కటిగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండూ టీడీపీ ఖాతాలో పడే అవకాశం లేదు.
ఇక మరో ఆరు శాసన మండలి స్థానాలకు ఈ రోజు ప్రకటన వచ్చింది. ఈ యేడాది మార్చి 29తో కాలపరిమితి ముగుస్తున్న ఐదుగురు సభ్యులతో పాటు మార్చి 2023 వరకూ కాలపరిమితి ఉన్న మరో స్థానానికి మార్చి 15న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఆరు స్థానాలకు శాసన సభ్యులు ఓటు వేయవలసి ఉంది.
Also Read:ఎన్నికలకు ముందు నంబర్ గేమ్.. రసకందాయంలో పుదుచ్చేరి రాజకీయం
ఇప్పుడు శాసనసభలో ఉన్న బలాబలాల దృష్ట్యా ప్రతిపక్ష టీడీపీ ఒక్క స్థానం కూడా గెలిచే పరిస్థితి లేదు. ఈ ఆరు స్థానాల్లో మూడు స్థానాలు ప్రస్తుతం టీడీపీకి చెందినవే. తనకున్న మూడు స్థానాలతో పాటు టీడీపీకి చెందిన మూడు స్థానాలను కూడా అధికారపార్టీ దక్కించుకోనుంది.
అలాగే ఈ యేడాది మే నెలలో శాసన మండలి చైర్మన్ షరీఫ్ తో పాటు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పదవీకాలం కూడా ముగుస్తోంది. దీంతో ఈ రెండు స్థానాలను కూడా అధికార పార్టీ అవలీలగా గెలిచుకోగలుగుతుంది.
ఆ తర్వాత జూన్ లో మరో టీడీపీ మరో 10 మంది సభ్యులను కోల్పోనున్నది. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన 11 మంది శాసనమండలి సభ్యుల పదవీకాలం జూన్ 2021లో ముగుస్తోంది. ఈ 11 మందిలో 10 మంది టీడీపీ సభ్యులు కాగా, ఒక్కరు అధికార పార్టీ సభ్యులు.
Also Read:పాక్‌పై విజయానికి అర్ధ శతాబ్ధం.. వీరునికి సీఎం జగన్ సన్మానం
ప్రస్తుతం స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీ అధిక స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో అనంతపురం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల స్థానిక సంస్థలనుండి జూన్ 18 లోపు 11 మందిని ఎన్నుకోవాల్సి ఉంది. వీటిలో అధికార పార్టీ ఎన్ని గెలుచుకోగలుగుతుంది, ప్రతిపక్ష టీడీపీ ఎన్ని గెలుచుకోగలుగుతుంది అనేదానిపై టీడీపీ తన బలాన్ని కోపోతుందా లేక కొద్దిగా నైనా నిలబెట్టుకుంటుందా అనేది తేలుతుంది.
హైదరాబాద్ రియాల్టీ రంగంలో బాగా వినిపిస్తున్న పేరు హస్తిన. ఇప్పటికే కోంపల్లిలో అగాలియా (Agalia), షాద్ నగర్ లో నేచర్ సిటీ (Nature City) రెసిడెన్షియల్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ను విజయవంతంగా నిర్వహిస్తోంది. నేచర్ సిటీలో 5.27 ఎకరాల్లో ప్రీమియం విల్లా ప్లాట్స్ సిద్ధమైయ్యాయి. కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక నేచర్ సిటీ 12 ఎకరాల్లో విస్తరించింది. షాద్ నగర్ అంటే బాగా ఎదుగుతున్న లొకాలిటీ. ఇక్కడున్న రెసిడెన్షియల్ ప్లాట్స్ కు కొన్నేళ్లలోనే మంచి […]