iDreamPost
iDreamPost
ఇప్పుడున్న యాక్టర్స్ లో హీరోగా చేసినా విలన్ గా నటించినా ఆ సినిమాకో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చిపెడుతున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి తెలుగులోనూ డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. సైరా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా మాస్టర్, ఉప్పెనలు ఇతని క్రేజ్ ని అమాంతం పెంచేశాయి. ఒకవేళ ఇవి ఇతర ఆర్టిస్టులు ఎవరు చేసినా బాక్సాఫీస్ రిజల్ట్ లో ఖచ్చితంగా తేడా ఉండేదన్న మాట వాస్తవం. అంతగా ప్రభావం చూపించగలుగుతున్నాడు కాబట్టే రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేసినా నిర్మాతలు రెడీ అంటున్నారు. అయితే తనను వద్దన్న హీరో ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు కానీ అది నిజం. అదేంటో చూడండి.
అమీర్ ఖాన్ హీరోగా హిందీలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న లాల్ సింగ్ చద్దా లో ముందు విజయ్ సేతుపతిని ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారు. కానీ తన ఇతర క్యారెక్టర్ల కోసం బరువు పెరిగిన ఇతన్ని చూసి ఇప్పుడు తమ సబ్జెక్టులో సెట్ కాడని మార్చేయమని అమీర్ ఖాన్ చెప్పినట్టు ఓ ప్రముఖ ముంబై మీడియాలో వచ్చిన హాట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ ఆధారంగా రూపొందుతున్న లాల్ సింగ్ చద్దా నిజానికి గత ఏడాదే విడుదల కావాల్సింది. లాక్ డౌన్ వల్ల సాధ్యం కాకపోవడంతో 2021 డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేశారు. ఇంకా డేట్ ని ప్రకటించాల్సి ఉంది.
మొత్తానికి విజయ్ సేతుపతి లాంటి వర్సటైల్ యాక్టర్ ని అమీర్ ఖాన్ వద్దని చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రస్తుతం చాలా బిజీ ప్రోజెక్టులతో లాక్ అయిపోయిన మక్కల్ సెల్వన్ కు లాల్ సింగ్ చద్దా డ్రాప్ కావడం వల్ల వచ్చిన నష్టమేమి లేదు. సుకుమార్ బన్నీ కాంబోలో తెరకెక్కుతున్న పుష్పలో కేవలం డేట్స్ కారణంగానే వదులుకున్న విజయ్ సేతుపతికి ఉప్పెన తెచ్చిన పేరు చాలా పెద్దది. తమిళంతో సమానంగా ఇప్పుడు తెలుగులోనూ ధీటుగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అన్నట్టు అమీర్ ఖాన్ బాలీవుడ్ నిర్మాతలు గట్టిగా ట్రై చేస్తున్న విక్రమ్ వేదా రీమేక్ ని కూడా తిరస్కరించాడని వినికిడి