iDreamPost
android-app
ios-app

శ్రీలంకకు పాక్ హెచ్చరిక

  • Published Oct 15, 2019 | 3:49 AM Updated Updated Oct 15, 2019 | 3:49 AM
శ్రీలంకకు పాక్ హెచ్చరిక

శ్రీలంక క్రికెట్ బోర్డుకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హెచ్చరికలు జారీ చేసేంది.ఇరు దేశాల ద్వైపాక్షిక సిరీస్‌ల ఒప్పందంలో భాగంగా వచ్చే డిసెంబర్‌లో జరుగనున్న టెస్టు సిరీస్‌ కోసం పాకిస్తాన్‌లో శ్రీలంక క్రికెట్‌ జట్టు పర్యాటించాల్సి ఉంది. అయితే ఆ జట్టు వస్తుందా.. లేదా అనే సందిగ్థంతో ఉన్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ).. ముందుగానే బెదిరింపు చర్యలకు దిగింది. ఇటీవల పాక్ లో జరిగిన వన్డే, టి 20 సిరీస్ కు శ్రీలంక సీనియర్‌ క్రికెటర్లు డుమ్మా కొట్టిగా శ్రీలంక ‘జూనియర్‌’ జట్టును పంపించింది

ఒకవేళ పాక్‌ పర్యటనకు రాకుండా తటస్థ వేదికైన యూఏఈలో ఆ సిరీస్‌ను నిర్వహించాలని శ్రీలంక కోరితే మాత్రం అందుకు అయ్యే ఖర్చును సమానంగా భరించాలంటూ హెచ్చరిక పంపింది. ‘పాకిస్తాన్‌లో పర్యటించడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము భద్రతా పరంగా అన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేస్తాం. కొన్ని రోజుల క్రితం కరాచీ, లాహోర్‌ వేదికగా జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌ విజయవంతమైంది. అలా కాకుండా యూఏఈలో నిర్వహించాలని పట్టుబడితే మాత్రం శ్రీలంక క్రికెట్‌ బోర్డు కూడా అందుకు ఖర్చు అయ్యే వాటాను భరించాలి’ అని పీసీబీలో అధికారి ఒకరు తెలిపారు.