రూ.150 ఉన్న సినిమా టికెట్ రూ.130కి తగ్గిందని పత్రికల్లో ప్రముఖంగా వస్తే అందరూ సంతోషించారు. నిజంగా తగ్గించారు కూడా. మాల్స్‌లో ఫుడ్ Over Rates కి అమ్ముతున్నారని అధికారులు హంగామా చేస్తే ఏదో జరుగుతుందనుకున్నారు. ఏమీ జరగలేదు.
అంతకు ముందు ప్రసాద్ Imaxలో బిస్లరీ వాటర్ బాటిల్ రూ.20కే అమ్మేవాళ్లు. ఇప్పుడు Half Litre అదేదో కంపెనీ రూ.50కి అమ్ముతున్నారు. అన్ని ధరలు ఫుల్‌గా పెంచేశారు.
సరే దీని సంగతి పక్కన పెడితే గత వారం నుంచి రూ.130 టికెట్ రూ.200 చేశారు. పత్రికల్లో ఎక్కడా వార్త లేదు. ఇప్పుడు ఒక మనిషి సినిమాకెళ్లాలంటే రూ.230 (Book My Show Rate), పెట్రోల్ రూ.100, (క్యాబ్‌లో వెళితే రానుపోనూ రూ.300), ఆకలేసి తింటే, తాగితే కనీసం రూ.300. ఒక మనిషి ఫ్యామిలీతో వెళితే రూ.1500-రూ.2000 ఖర్చు.
హైదరాబాద్‌లో మాల్స్‌లో పార్కింగ్ చార్జ్ ఎత్తేశారు కానీ, లోపల అంతకు మించి పెంచేశారు. ఇప్పుడు దీన్ని దోపిడీ అని ఎవరూ అనడం లేదు. తిరుమలకు వెళ్లినట్టు మనమే నేరుగా వెళ్లి గుండు కొట్టించుకుంటున్నాం.
సినిమా బాగలేక పోతే డబ్బులు పోతాయి, తలనొప్పి అదనం.
3621