iDreamPost
android-app
ios-app

VIDEO: షమీ దెబ్బకు ఆస్ట్రేలియా విలవిల! స్టోయినిస్‌ వికెట్‌ నెక్ట్స్‌ లెవెల్‌

  • Published Sep 22, 2023 | 5:58 PM Updated Updated Sep 22, 2023 | 5:58 PM
  • Published Sep 22, 2023 | 5:58 PMUpdated Sep 22, 2023 | 5:58 PM
VIDEO: షమీ దెబ్బకు ఆస్ట్రేలియా విలవిల! స్టోయినిస్‌ వికెట్‌ నెక్ట్స్‌ లెవెల్‌

టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ 5 వికెట్లతో చెలరేగాడు. మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో షమీ సూపర్‌ బౌలింగ్‌తో సత్తా చాటాడు. మిచెల్‌ మార్ష్‌, స్టీవ్‌ స్మిత్‌, స్టోయినిస్‌.. ఇలా స్టార్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టించాడు. 300 పైచిలుకు స్కోర్‌ చేస్తుందనుకున్న ఆస్ట్రేలియా షమీ దెబ్బకు 276 పరుగులకే పరిమితం అయింది. డేంజరస్‌ బ్యాటర్‌ మిచెల్‌ మార్ష్‌ను ఆరంభంలోనే అవుట్‌ చేయడంతో.. టీమిండియా మంచి స్టార్ట్‌ అందించాడు. షమీ.. అతనిచ్చిన స్టార్‌తో జడేజా, అశ్విన్‌ సైతం చెరో వికెట్‌తో ఆసీస్‌ను కంట్రోల్‌ చేసే ప్రయత్నం చేశారు.

కానీ, నిదానంగా ఆస్టేలియా పెద్ద స్కోర్‌ వైపు అడుగులేస్తుండటంతో షమీ తన రెండో స్పెల్‌కి వచ్చి స్మిత్‌ను అవుట్‌ చేశాడు. ఇక చివరి ఐదు ఓవర్లలో ఐదు వికెట్ల చేతిలో ఉన్న ఆస్ట్రేలియా భారీగా పరుగులు చేస్తుందనుకున్న తరుణంలో.. మళ్లీ షమీ వచ్చి.. ఆసీస్‌ను చావు దెబ్బ తీశాడు. హార్డ్‌ హిట్లర్‌ స్టోయినీస్‌తో పాటు మ్యాథ్యూ షార్ట్‌, సీన్‌ అబాట్‌లను అవుట్‌ చేసి.. ఐదు వికెట్ల హాల్‌ సాధించడంతో పాటు డెత్‌ ఓవర్స్‌లో ఆసీస్‌ పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. ఇలా షమీ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శనతో 300 పరుగులు చేయాల్సిన ఆస్ట్రేలియా 276తో సరిపెట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌.. తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు నిర్ణయించాడు. ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించి.. షమీ చేతికి బంతిచ్చాడు. తన తొలి ఓవర్‌లోనే షమీ, మార్ష్‌ను అవుట్‌ చేయడం ద్వారా రాహుల్‌ నిర్ణయం సరైందేనని చాటి చెప్పాడు. కానీ, వార్నర్‌, స్మిత్‌ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. మొత్తానికి డేవిడ్‌ వార్నర్‌ 52, స్మిల్‌ 41, లబుషేన్‌ 39, జోష్‌ ఇంగ్లిస్‌ 45.. రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో షమీ 5, జడేజా, అశ్విన్‌, బుమ్రా తలో వికెట్‌ పడగొట్టారు. మరి ఈ మ్యాచ్‌లో షమీ అద్భుత బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలవాలంటే.. వాళ్లని ఓడించాలి: గంభీర్‌