తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. మరో 5 రోజులు వానలే వానలు..!

Weather Report: ప్రస్తుతం తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి సయంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది.

Weather Report: ప్రస్తుతం తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి సయంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది.

ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొన్ని మే మొదటి వారం నుంచి తెలంగాణ వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎండలకు ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు అదిరిపోయే శుభవార్త తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. తూర్పు విద్భ, మహారాష్ట్ర, తమిళనాడులో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై బలంగా విస్తరించిందని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు తెలంగాణలో వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.

తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది వాతావరణ శాఖ. శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉండటమే కాదు.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపారు. మొన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇలాంటి సమయంలో చల్లని వార్త విని కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మే 15 వరకు ఇదే వాతావరణం ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలోనే పెద్లపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో వేగంగా ఈదరు గాలులతో కూడిన వర్షాలు పడే సూచన ఉందని ఆరేంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో గురువరం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవ్వగా.. మిగతా జిల్లాలో 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే..ఈ రోజు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి, కొత్తగూడెం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని.. సమస్యలు ఎదురైతే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ కి 40–21111111; 90001 13667 నంబర్ల​కు ఫోన్ చేయాల్సిందిగా అధికారులు కోరారు.

Show comments