తెలంగాణ ఉన్నత విద్యా మండలి పేరు మార్చిన ప్రభుత్వం

తెలంగాణ ఉన్నత విద్యా మండలి పేరు మార్చిన ప్రభుత్వం

తెలంగాణ స్టేట్ స్థానంలో తెలంగాణ అని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి చెందిన పలు శాఖల్లో పేర్లలో మార్పులు సంతరించుకుంటున్న సంగతి విదితమే. తాజాగా

తెలంగాణ స్టేట్ స్థానంలో తెలంగాణ అని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి చెందిన పలు శాఖల్లో పేర్లలో మార్పులు సంతరించుకుంటున్న సంగతి విదితమే. తాజాగా

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..వడివడిగా కొన్ని కీలక మార్పులు చేపడుతోంది. తెలంగాణ మోటారు వాహనాల రిజిష్ట్రేషన్ రాష్ట్ర కోడ్ టీఎస్ నుండి టీజీ (TG)గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. అలాగే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) పేరు కూడా మారింది. టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చినట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఇటీవల వెల్లడించారు. అలాగే రాష్ట్ర సాంగ్ జయ జయ హే తెలంగాణ పాటలో మార్పులు చేర్పులు చేసింది. అలాగే తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు విద్యా శాఖలో కూడా అధికారిక ఛేంజెస్ చోటుచేసుకుంటున్నాయి.

తెలంగాణ స్టేట్ స్థానంలో తెలంగాణ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ శాఖల పేర్లు కూడా మారుతున్నాయి. తాజాగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) పేరును.. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( TGCHE)గా ప్రభుత్వం పేరు మార్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బి వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో స్టేట్ అనే పదాన్ని తొలగించి.. మిగిలినది యథావిధిగా కొనసాగిస్తుంది తెలంగాణ సర్కార్. తెలంగాణ స్టేట్ బదులు కేవలం తెలంగాణగా మారుస్తూ ఆర్డర్స్ జారీ అయ్యాయి. కాగా, ఇప్పటికే TSPSC నిTGPSC గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా మారింది.

ఇక పోతే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది తెలంగాణ సర్కార్. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు రిహార్సల్స్ కూడా చేశారు. ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులుకు ఆహ్వానాలు అందాయి. ఆహ్వానితులకు ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్ మొత్తం డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌లతో ముమ్మర తనిఖీలు చేశారు. ఈ వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కలెక్టర్ అనుదీప్, పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు.

Show comments