తెలంగాణకు మళ్లీ రెయిన్‌ అలర్ట్‌.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

తెలంగాణకు మళ్లీ రెయిన్‌ అలర్ట్‌.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు కొద్దిగా బ్రేక్‌ పడింది. గత రెండో రోజులుగా వరుణుడు సెలవు తీసుకున్నాడు. దాంతో ఈ రెండు రోజులుగా వాన ముచ్చట లేదు. అయితే తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 3, 4 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటిందని.. ఫలితంగా రానున్న రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రుతు పవనాలు బలపడటంతో తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. దాంతో నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించింది.

రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇక హైదరాబాద్‌లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు వాతావరణశాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Show comments