Former DSP Nalini: CM రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ DSP నళిని! తెలంగాణ వీరవనిత..

CM రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ DSP నళిని! తెలంగాణ వీరవనిత..

Former DSP Nalini: తెలంగాణ ఉద్యమ సాధన కోసం 2011లో నళిని తన ఉద్యోగాన్ని వదిలేశారు. తన అన్నాదమ్ముళ్ల లాంటి ఉద్యమకారులపై లాఠీ ఎత్తలేనంటూ గొంతెత్తి, ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించి నళిని వార్తల్లో నిలిచారు

Former DSP Nalini: తెలంగాణ ఉద్యమ సాధన కోసం 2011లో నళిని తన ఉద్యోగాన్ని వదిలేశారు. తన అన్నాదమ్ముళ్ల లాంటి ఉద్యమకారులపై లాఠీ ఎత్తలేనంటూ గొంతెత్తి, ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించి నళిని వార్తల్లో నిలిచారు

నళిని.. తెలంగాణ రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. కారణం.. తెలంగాణ కోసం తన డీఎస్పీ  ఉద్యోగాన్నే త్యాగం చేసిన వీరవనిత ఆమె. 2011 తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులపై లాఠీ ఛార్జీ చేసుకోలేనని, అంతేకాక ఉద్యమాన్ని అణిచేలా తాను చేయలేని  అధికారుల ఆదేశాలనే ఆమె ధిక్కరించారు. అలా తెలంగాణ  కోసం తన డీఎస్సీ పదవి రాజీనామా చేశారు. అంతేకాక తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేశారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఆమె తిరిగి విధుల్లోకి రాలేదు. ఇటీవలే  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాయి. నళిని తిరిగి వార్తల్లో  నిలిచారు. తాజాగా మాజీ డీఎస్సీ, తెలంగాణ ఉద్యమకారిణి నళిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అలానే నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కుటుంబాలను మర్చిపోమంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే తెలంగాణ కోసం తన ఉద్యోగాన్ని కోల్పోయిన నళిని అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆమె అంగీకరిస్తే.. తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ఉద్యమ సాధన కోసం 2011లో నళిని తన ఉద్యోగాన్ని వదిలేశారు. తన అన్నాదమ్ముళ్ల లాంటి ఉద్యమకారులపై లాఠీ ఎత్తలేనంటూ గొంతెత్తి, ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించి నళిని వార్తల్లో నిలిచారు. అంతేకాక అధికారులు వివరణ కోరితే.. తెలంగాణ సాధన కోసం తన డీఎస్పీ ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలేశారు. నాడు డీఎస్పీగా నళిని చేసిన త్యాగం ప్రభుత్వాలనే కదిలించింది. ఉద్యమాన్ని మరో స్థాయికి చేర్చింది. ఢిల్లీలో దీక్షలో పాల్గొన్నారు. నాడు ఆమె చేసిన త్యాగం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది.

తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత నళిని మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రస్తావించారు. ఆమెకు తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని అధికారులకు సీఎం సూచించారు.

అంతేకాక తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పిచాలని అధికారులను సీఎం గతంలోనే ఆదేశించారు. అయితే తాను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాని, తిరిగి విధుల్లో చేరలేనని ఆమె ఇప్పటికే ప్రకటించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిని కలసి మాట్లాడుతానని నళిని తెలిపారు. ఈ క్రమంలోనే శనివారం ఆమె సెక్రటెరియట్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తాను రాసిన ఆధ్యాత్మిక పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. అయితే, రేవంత్ రెడ్డి ఆమెకు ఎలాంటి హామీ ఇచ్చారనేది తెలియాల్సి ఉంది. మరి.. సీఎం రేవంత్ రెడ్డితో మాజీ డీఎస్పీ నళిని కలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments