గుడ్ న్యూస్.. మగవారికి కూడా ఉచిత ప్రయాణం..!

గుడ్ న్యూస్.. మగవారికి కూడా ఉచిత ప్రయాణం..!

Free Travel for Men: తెలంగాణలో మహిళలకు ఫ్రి ప్రయాణ సదుపాయం ఉందనే విషయం తెలిసిందే.. మగవారికి కూడా ఫ్రి ప్రయాణ సదుపాయం ఉందనే విషయం మీకు తెలుసా? ఆ వివరాలు మీకోసం..

Free Travel for Men: తెలంగాణలో మహిళలకు ఫ్రి ప్రయాణ సదుపాయం ఉందనే విషయం తెలిసిందే.. మగవారికి కూడా ఫ్రి ప్రయాణ సదుపాయం ఉందనే విషయం మీకు తెలుసా? ఆ వివరాలు మీకోసం..

తెలంగాణలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్లింది. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించింది. మిగతా నాలుగు పథకాల అమలుకు కసరత్తు చేస్తుంది. మహాలక్ష్మి పథకం లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికైనా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆడవారే కాదు.. మగవారు కూడా  ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించింది తెంగాణ సర్కార్. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నుంచి ‘మహాలక్ష్మి’పథకంలో భాగంగా మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే.  బస్సుల్లో ఎక్కిన మహిళల వద్ద నుంచి ఒక్కరూపాయి తీసుకోకుండా జీరో టికెట్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే మహిళలకే కాదు పురుషులు కూడా టికెట్ లేకుండా ఫ్రి ప్రయాణ సదుపాయం ఉందనే విషయం మీకు తెలుసా? హైదరాబాద్ నగరవాసులకు కొన్ని బస్సుల్లో ఉచిత సదుపాయం అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. హైదరాబాద్ వాసులకు డబులు డెక్కర్ బస్సుల గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఒకప్పుడు ఈ బస్సుల్లో నగరవాసులు ఎంచక్కా తిరిగేవారు.

హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సుల్లో ఇప్పుడు అందరికీ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. హైదరాబాద్ మెట్ర్ పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో ఆరు ఎలక్ట్రికల్ బస్సులను కోనుగోలు చేసి.. హుస్సేన్ సాగర్, ఇందిరా గాంధీ రోటరీ వద్ద నుంచి సివరేజ్ ట్రీట్ ప్లాంట్ నుంచి ఈ బస్సు సౌకర్యం కల్పించేలా మార్గాలను ఖరారు చేశారు. ఇందులోో మొదటి రూట్ ను నెక్లెస్ రోడ్డు నుంచి హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ, గచ్చీ బౌలీ, విప్రో జంక్షన్ నుంచి వేవ్ రాక్ వరకు.. రెండవ రూట్ చార్మినార్ వరకు.. ఇక మూడవ రూట్ ట్యాంక్ బండ్ చుట్టూ నడుపుతున్నారు. నగర వాసులు ఆడ, మగ ఎవరైనా సరే ఈ మూడు మార్గాల్లో డబుల్ డెక్కర్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవొచ్చని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే రేవంత్ రెడ్డి మహిళల కోసం తీసుకు వచ్చిన ‘మహాలక్ష్మి’ పథకానికి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments