కూతురే కొడుకైంది..తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది!

కూతురే కొడుకైంది..తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది!

సమాజంలో జరిగే కొన్ని కొన్ని ఘటనలు చూస్తే.. మనస్సు చలించిపోతుంది. ముఖ్యంగా ఆడపిల్లలే తమ తల్లిదండ్రులకు తలకొరివి పెట్టే ఘటనలు చాలా వేదనకు గురి చేస్తుంటాయి. తాజాగా ఓ యువతి కొడుకుగా మారి.. తన తండ్రి చితికి నిప్పు పెట్టింది.

సమాజంలో జరిగే కొన్ని కొన్ని ఘటనలు చూస్తే.. మనస్సు చలించిపోతుంది. ముఖ్యంగా ఆడపిల్లలే తమ తల్లిదండ్రులకు తలకొరివి పెట్టే ఘటనలు చాలా వేదనకు గురి చేస్తుంటాయి. తాజాగా ఓ యువతి కొడుకుగా మారి.. తన తండ్రి చితికి నిప్పు పెట్టింది.

ప్రతి తల్లిదండ్రులు తమ అంతిమ సంస్కారాలు చేసేందుకు కొడుకు ఉండాలని కోరుకుంటారు. కొడుకు తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని భావిస్తారు. కానీ కొడుకు కంటే కూతురు తక్కువేం కాదంటూ కూతురే కొడుకై తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించి తల కొరివి పెట్టిన ఘటన అనేకం చోటుచేసుకున్నాయి. కొందరు కొడుకులు తల్లిదండ్రులను పట్టించుకోరు. అలాంటి వారికి కూతుర్లే కొడుకుల్లా మారి సేవలు చేస్తుంటారు. చివరకు ఆ కన్నవారు కన్నుమూస్తే అంతిమ సంస్కారాలు కూడా ఆడబిడ్డలే చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే నల్లొండ జిల్లాలో చోటుచేసుకుంది.

నల్గొండ జిల్లా చిలుకూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ రావు(41) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండే వాడు. ఆయనకు కుమార్తె మౌనికా మాత్రమే సంతానం. శ్రీనివాస్ రావుకు కొడుకులు లేకపోవడంతో మౌనికాని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. చిన్నతనం నుంచి ఆ పాపకు ఏ కష్టం రాకుండా శ్రీనివాస్ రావు దంపతులు చూసుకున్నారు. ఇటీవల కొంతకాలం నుంచి శ్రీనివాస్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడని సమాచారం. తరచూ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకునే వాడు. ఇలా అనారోగ్యంతో బాధ పడుతున్నప్పటికి ఆయన ధ్యాస అంత కుమార్తెపైనే ఉండేది. చివరకు అనారోగ్యోంతో బుధవారం శ్రీనివాస్ రావు మృతి చెందారు.

ఆయన అంత్యక్రియలు ఏర్పాట్లు చేశారు. కుమారుడు లేకపోవడంతో తలకొరివి ఎవరు పెట్టాలా అనే సందేహం ఏర్పడింది. మృతుడి కుమార్తె మౌనికతో పెట్టించేందుకు తొలుత కొందరు సందేహం వ్యక్తం చేశారు. చివరకు కొడుకైన, కుమార్తెన అన్ని  ఆ పాపే అని మరికొందరు చెప్పడం.. అంత్యక్రియలు జరిగాయి. ఒకవైపు తండ్రి మరణాన్ని గుండెల్లో దాచుకుని తలకొరివి పెట్టింది. అలా ఆ యువతి తన తండ్రికి తలకొరివి పెట్టి..కన్నరుణాన్ని తీర్చుకుంది. శ్రీనివాస్ రావు చితికి మౌనిక నిప్పు పెట్టింది. అందరూ ఆమెకు తోడు నిలబడ్డారు. దీనిని చూసిన వాళ్ళు దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు. మృతుడి కుమార్తె  మౌనిక అన్ని తానై తండ్రికి తలకొరివి పెట్టి కర్మకాండలు నిర్వహించి తండ్రి రుణం తీర్చుకుంది. ఈ ఘటన చూసి పలువురు గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు.

ఇలాంటి హృదయ విదారక ఘటనలు తరచూ అనేకం జరుగుతుంటాయి. ప్రపంచం టెక్నాలజీలో జెట్‌ స్పీడ్‌తో ముందుకెళ్తున్నా సమాజంలో లింగ బేధలు కొనసాగుతూనే ఉన్నాయి. చదువు, ఉద్యోగం, టెక్నాలజీలో పురుషులకు ధీటుగా మహిళలు దూసుకుపోతున్నారు. పితృకర్మల విషయాల్లో మహిళలపై ఆంక్షలు అలాగే ఉన్నాయి. ఒకప్పుడు కన్నవారు చనిపోతే కొడుకులే కర్మలు చేయాలి. ఒకవేళ వారికి మగపిల్లలు లేకపోతే బంధువుల్లో ఎవరైనా కర్మకాండలు నిర్వహించే వారు. కానీ నేటికాలంలో  కొంతమంది మహిళల్లో మార్పులొస్తున్నాయి. అందుకు ఉదాహరణ తాజాగా చోటుచేసుకున్న ఘటన. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments