Wakefit ZenseTemperature-Control Mattress: టెంపరేచర్ సెట్ చేసుకునే పరుపు, వారేవా మాములుగా లేదు

Mattress: టెంపరేచర్ సెట్ చేసుకునే పరుపు, వారేవా మాములుగా లేదు

Wakefit Zense: వేక్‌ఫిట్‌ పరుపుల కంపెనీ సరికొత్త ఆవిష్కరణ చేసింది. తమ కంపెనీ పరుపుల్లో టెంపరేచర్‌ సెట్‌ చేసుకునే నూతన టెక్నాలజీని తీసుకుని వచ్చింది. ఆ వివరాలు..

Wakefit Zense: వేక్‌ఫిట్‌ పరుపుల కంపెనీ సరికొత్త ఆవిష్కరణ చేసింది. తమ కంపెనీ పరుపుల్లో టెంపరేచర్‌ సెట్‌ చేసుకునే నూతన టెక్నాలజీని తీసుకుని వచ్చింది. ఆ వివరాలు..

టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే ఉండటంతో.. ప్రతి ఒక్కరు వారి ప్రొడక్ట్స్ ని వారే అప్డేట్ చేసుకుంటున్నారు, మనకి గాలి వెయ్యకపోతే ఫ్యాన్ వేసుకుంటాం, ఆ టెంపరేచర్ కూడా సరిపోకపోతే AC వేసుకుంటాం, అసలు అవన్నీ ఎందుకు సుఖమైన నిద్ర కోసం వేక్‌ఫిట్‌ పరుపులు తయారు చేసే వారు అసలు ఇలాంటి ఒకటి టెక్నాలజీనే మా పరుపులోనే పెట్టేస్తే ఎలా ఉంటుంది అని అలోచించి ఒక కొత్త రకమైన పరుపుని లాంచ్ చేశారు.

అదే Wakefit Zense అలాగే Regul8, Track8 ల AI పరుపు. AI టెక్నాలజీ అంటే ఏంటో అనుకున్నాం కాని నిజానికి అన్ని రంగాల్లోకి AI వచ్చేస్తుంది. రీసెంట్ గా Wakefit కంపెనీ తన కొత్త AI బేస్డ్ పరుపు (మెట్రస్)ని Wakefit Zense అనే పేరుతో లాంచ్ చేసింది. ఈ Zenseలో Regul8 అనే టెంపరేచర్ మైంటైన్ చేసే టెక్నాలజీ ఉన్న మెట్రస్ అలాగే Track8 అనే కాంటాక్ట్లెస్ స్లీప్ ట్రాకింగ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.

ఈ టెక్నాలజీతో, మనం నిద్రపోయే నిద్రలో ఉన్న క్వాలిటీ.. అంటే ఎంత సేపు ఘాడ నిద్రలో ఉంటున్నాం, ఎంత సేపు లైట్ స్లీప్ లో ఉంటున్నాం, ఎంత సేపు డిస్టర్బ్డ్‌స్లీప్ లో ఉంటున్నాం ఇలా నిద్ర నాణ్యతను మెరుగుపర్చడానికి అలాగే స్లీప్ హెల్త్ ని ప్రోత్సహించడానికి ఈ టెక్నాలజీని నిద్ర వాతావరణంలోకి తీసుకురావాలని ఈ కంపెనీ పేర్కొంది. ఈ రెండు పరికరాలు డ్యుయల్-జోన్ సెన్సార్లతో వస్తాయి, ప్రతి బెడ్ సైడ్‌కు కస్టమ్ స్లీప్ వాతావరణం ఉండేలా చూస్తాయి. Wakefit Zenseలో ఈ పరుపులు ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి.

Wakefit Zense Regul8, Track8 రేటేంత

Wakefit Zense పరిధిలో Regul8 మెట్రస్ రేటు రూ. 44,999. ఈ మెట్రస్ క్వీన్ (78×60 అంగుళాలు) అలాగే కింగ్ (78×72 అంగుళాలు) పరిమాణాలలో లభ్యం అవుతున్నాయి. Track8 నిద్ర ట్రాకింగ్ షీట్ రేటు రూ. 10,499. ఈ రెండు పరికరాలు ప్రస్తుతము ప్రీ-బుకింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 499 చొప్పున, లేదా రెండింటికి కలిపి రూ. 899 కట్టి బుక్ చేసుకునేలా అందుబాటులో ఉన్నాయి.

Wakefit Zense Regul8 ఫీచర్స్

కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం, Regul8 మెట్రస్ మెయిన్ సిస్టమ్‌తో మెట్రస్ పైన ఉష్ణోగ్రతను 15-డిగ్రీల నుండి 40-డిగ్రీల సెల్సియస్ మధ్య సెటప్ చేయవచ్చు. Regul8 డ్యుయల్-జోన్ టెంపరేచర్ రెసిస్టన్స్ను కలిగి ఉంది, ఇది బెడ్ కి ప్రతి వైపు అనేక టెంపరేచర్లను సెటప్ చేయవచ్చు. ఈ మెట్రస్ ఇంటిగ్రేటెడ్ టెంపరేచర్ సెన్సార్లతో వస్తుంది. ఇవి మెట్రస్ పైన టెంపరేచర్ను మానిటర్ చేస్తాయి. అలాగే రాత్రంతా స్టేబుల్గా ఉంచడానికి రియల్-టైమ్ అడ్జస్ట్మెంట్ చేస్తాయి. దీనిలో న్యూట్రల్, కోల్డ్, వార్మ్, ఐస్, ఫైర్ అనే ఐదు రకాల ప్రీసెట్స్ ఉన్నాయి, వీటి ద్వారా మనకు కావాల్సిన టెంపరేచర్‌కు తగ్గట్టుగా ఉష్ణోగ్రతను సెట్ చేయడానికి ఉపయోగించవచ్చు. Wakefit ప్రకారం, Regul8 మెట్రస్ 1.5-టన్ AC కన్నా 60 శాతం తక్కువ విద్యుత్‌ వినియోగిస్తుంది.

Wakefit Zense Track8 ఫీచర్స్

Track8, Wakefit Zense జోన్ లోని ఒక స్లీపింగ్ డివైస్, ఇది కాంటాక్ట్లెస్ విధానంలో యూజర్ల నిద్ర అలవాట్లు అలాగే ఇతర మెట్రిక్స్‌ను ట్రాక్ చేస్తుంది. ఇది రెండు షీట్ సెన్సార్లతో ఉండే సన్నని దీర్ఘచతురస్రాకార షీట్ ఫాబ్రిక్, ఈ డివైస్ మెట్రస్ కింద ఉంటుంది. ఇది డ్యుయల్-జోన్ సెన్సార్లను కలిగి ఉండడం వలన ఒక బెడ్ మీద ఇద్దరు నిద్రపోతే వారి ఇద్దరినీ ఒకేసారి ట్రాక్ చేయగలదు. ఈ డివైస్ సేకరించిన డేటాను కంపానియన్ యాప్‌కు డైరెక్ట్ గా పంపుతుంది, ఇది సమాచారాన్ని ప్రాసెస్ చేసి డీటెయిల్ గా స్లీప్ ఇండెక్స్ ను అందిస్తుంది.

కంపెనీ ప్రకారం, ఈ డివైస్ AI, మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్‌ను ఉపయోగించి స్లీప్ ఫేజులను, బ్రీత్‌ రేటును, మూమెంట్ ను, నిద్ర అలాగే మేల్కొన్న సమయము, బెడ్ పైన అలాగే బెడ్ బయట సమయము, మరియు గురక వంటి డేటాను సేకరిస్తుంది. ఒకసారి విశ్లేషించబడిన తర్వాత, ఇది ప్రొపెర్ స్లీప్ స్కోరును కూడా అందిస్తుంది.

ఫీచర్స్ అయితే మాములుగా లేవు కదా. నచ్చితే మీరు కూడా ఒకటి తీసుకోండి, మీ స్లీప్ డేటా ని ఎనాలిసిస్ చేసుకుని దానికి తగ్గట్టుగా లైఫ్ స్టైల్ మార్పులు చేసుకుని ఆరోగ్యంగా ఉండండి.

Show comments