టీ20 వరల్డ్‌ కప్‌లో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టే క్రికెటర్‌ అతనే: యువీ

Yuvraj Singh, Hardik Pandya: ఐపీఎల్‌లో పెద్దగా రాణించని ఓ ఆటగాడు.. టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొడతాడని యువరాజ్‌ సింగ్‌ అంటున్నాడు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Yuvraj Singh, Hardik Pandya: ఐపీఎల్‌లో పెద్దగా రాణించని ఓ ఆటగాడు.. టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొడతాడని యువరాజ్‌ సింగ్‌ అంటున్నాడు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ఐపీఎల్‌ ఎంతో జోరుగా సాగుతోంది. బ్యాటర్ల రాజ్యంగా మారిన ఐపీఎల్‌ 2024 సీజన్‌లో బౌలర్లు పాపం బలైపోతున్నారు. అయితే.. ఐపీఎల్ లేని కాలంలోనే కేవలం 12 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించి, ఒకే ఓవర్‌లో 6 సిక్సులు కొట్టి ప్రపంచ క్రికెట్‌ను ఓ బ్యాటర్‌ ఉలిక్కిపడేలా చేశాడు. అతనే ఇండియన్‌ క్రికెట్‌కు ఎవర్‌ గ్రీన్‌ యువరాజు.. మన యువరాజ్‌ సింగ్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకుని అద్భుతమైన క్రికెటర్‌గా నిలిచిన యువీ.. టీ20 వరల్డ్‌ కప్‌ 2007లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ ఓవర్‌లో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ యువీ పేరు చెబితే చాలా మందికి ఆ 6 సిక్సులే గుర్తుకు వస్తాయి.

అయితే.. తనలానే రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఓ టీమిండియా క్రికెటర్‌ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొడతాడని ఆశిస్తున్నట్లు యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. ఇంతకీ యువీ ఎవరి పేరు చెప్పాడో తెలిస్తే.. మీరు కూడా షాక్‌ అవుతారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్‌ పాండ్యా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టగలడని యువీ అభిప్రాయపడ్డాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టగల ఆటగాళ్లలో టీమిండియా క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యా కూడా ఒకడని, టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో అతను ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొడతాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. కానీ, ప్రస్తుతం పాండ్యా చెత్త ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు కనీసం ఒక్కటంటే ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా చేయలేదు.

రోహిత్‌ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురుస్తోంది. పైగా ముంబై ఇండియన్స్‌ తమ స్థాయి ప్రదర్శన చేయకపోవడం, పాండ్యా కూడా బ్యాటర్‌గా, బౌలర్‌గా దారుణంగా విఫలం అవుతుండటంతో పాండ్యాను క్రికెట్‌ అభిమానులు ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు. అసలు హార్ధిక్‌ పాండ్యాకు టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కుతుందా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో యువరాజ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అయితే.. యువీ కామెంట్స్‌తో చాలా మంది క్రికెట్‌ అభిమానులు ఏకీభవించడం లేదు. పాండ్యాకు ఆరు సిక్సులు కొట్టేంత సీన్‌ లేదని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments