Yashasvi Jaiswal: కోహ్లీ, రోహిత్‌ రికార్డ్‌ బ్రేక్‌! కొత్త చరిత్ర లిఖించిన జైస్వాల్‌

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సంచలన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. 179 పరుగులు చేసి.. ఓ అరుదైన రికార్డు అందుకుని, భారత క్రికెట్‌ చరిత్రలోనే తొలి బ్యాటర్‌గా నిలిచాడు. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సంచలన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. 179 పరుగులు చేసి.. ఓ అరుదైన రికార్డు అందుకుని, భారత క్రికెట్‌ చరిత్రలోనే తొలి బ్యాటర్‌గా నిలిచాడు. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి రోజు సంతృప్తికరంగానే ముగించింది. 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. అయితే.. జట్టులోని ప్రధాన బ్యాటర్లంతా విఫలమైనా.. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి.. 179 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అందుకే టీమిండియా ఇంత భారీ స్కోర్‌ చేసింది. జైస్వాల్‌ నిలబడకపోయి ఉంటే.. టీమిండియా చాలా తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ అయిపోయేది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు టాప్‌ బ్యాటర్లంతా విఫలం అయ్యారు. జైస్వాల్‌ ఒక్కడే ఇంగ్లండ్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సెంచరీతో సత్తాచాటాడు.

257 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సులతో 179 పరుగులు చేసి.. నాటౌట్‌గా మిగిలాడు. రెండో రోజు కూడా జైస్వాల్‌ ఇదే టెంపో కొనసాగిస్తే.. డబుల్‌ సెంచరీ చేయడం ఖాయం. అయితే.. బ్యాటింగ్‌లో జైస్వాల్‌ ఒక్కడే గెలవాలనే కసితో ఆడుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఎందుకుంటే.. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైనా కూడా కనీసం రెండో టెస్టులోనూ ఎవరూ ఓపికగా పరుగులు చేయడం లేదు. మంచి స్టార్ట్‌ దక్కినా పెద్ద స్కోర్‌గా మల్చలేకపోతున్నారు. రోహిత్‌ శర్మ తన బ్యాట్‌ కొనసాగిస్తూ.. 14 పరుగులకే అవుట్‌ అయ్యాడు.

శుబ్‌మన్‌ గిల్‌ 34, శ్రేయస్‌ అయ్యర్‌ 27 రన్స్‌ మాత్రమే చేసి మరోసారి దారుణంగా నిరాశపర్చారు. తొలి మ్యాచ్‌ ఆడుతున్న రజత్‌ పాటిదార్‌ 32 పరుగులతో పర్వలేదనిపించాడు. కానీ, దురదృష్టవశాత్తు అవుట్‌ అయ్యాడు. అక్షర్‌ పటేల్‌ 27, కేఎస్‌ భరత్‌ 17 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యారు. ఇలా వికెట్లు పడుతున్నా.. జైస్వాల్‌ మాత్రం తన అద్భుతమైన బ్యాటింగ్‌ కొనసాగించాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును జైస్వాల్‌ తన ఖాతాలో వేసుకుని, ఈ రికార్డ్‌ సాధించిన తొలి భాతర క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఒక టెస్టు మ్యాచ్‌ తొలి రోజు బ్యాటింగ్‌ చేస్తూ అత్యధిక స్కోర్‌ చేసిన బ్యాటర్‌గా జైస్వాల్‌ సరికొత్త రికార్డ్‌ నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డ్‌ రోహిత్‌ శర్మ పేరిట ఉండేది. 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 161 పరుగులు చేశాడు. ఆ రికార్డును తాజాగా జైస్వాల్‌ బ్రేక్‌ చేశాడు. ప్రస్తుతం జైస్వాల్‌ 179 పరుగులతో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. 161 పరుగులతో రోహిత్‌ శర్మ రెండో ప్లేస్‌లో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో టీమిండియా స్టార​ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 2017లో శ్రీలంకపై 156 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ తర్వాతి స్థానంలో మురళీ విజయ్‌ నిలిచాడు. విజయ్‌ 2017లో శ్రీలంకపైనే తొలి రోజు ఆటలో 155 పరుగులు చేశాడు. మరి కోహ్లీ, రోహిత్‌ శర్మను దాటేసి.. జైస్వాల్‌ ఈ రికార్డు సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments