వన్డే వరల్డ్ కప్-2023లో పసికూన నెదర్లాండ్స్ ఎక్స్పెక్టేషన్స్కు మించి ఆడుతోంది. తమ ఆటతీరుతో బిగ్ టీమ్స్‌కు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తాజాగా ఆ టీమ్ చరిత్ర సృష్టించింది. ఆసీస్, ఇండియా వంటి జట్ల కాని ఓ రేర్ ఫీట్‌ను సాధించింది.
వన్డే వరల్డ్ కప్-2023లో పసికూన నెదర్లాండ్స్ ఎక్స్పెక్టేషన్స్కు మించి ఆడుతోంది. తమ ఆటతీరుతో బిగ్ టీమ్స్‌కు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తాజాగా ఆ టీమ్ చరిత్ర సృష్టించింది. ఆసీస్, ఇండియా వంటి జట్ల కాని ఓ రేర్ ఫీట్‌ను సాధించింది.
క్రికెట్లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా లాంటి బడా దేశాలదే పెత్తనం. ఈ టీమ్స్‌తో ఆడాలంటే మిగతా టీమ్స్ అన్నీ భయపడతాయి. ఒకప్పుడు వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే లాంటి జట్లు కూడా బలంగా ఉండేవి. కానీ ఇప్పుడు అవి బలహీనంగా మారాయి. పాకిస్థాన్ గురించి తెలిసిందే.. అస్థిరతకు ఆ టీమ్ పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎప్పుడు ఎలా ఆడుతుందో అస్సలు చెప్పలేం. అందుకే పాక్‌ను బడా టీమ్స్ లిస్టులో చేర్చలేం. అయితే పెద్ద జట్లతో ఆడాలంటే ఆఫ్ఘానిస్థాన్, నెదర్లాండ్స్ లాంటి పసికూన జట్లు భయపడతాయి.
ఆఫ్ఘాన్, డచ్ టీమ్స్‌తో పెద్ద టీమ్స్ ఆడితే పాత రికార్డులన్నీ బ్రేక్ కావాల్సిందే అన్నట్లుగా ఉండేది. ఆ పసికూన జట్లపై బడా టీమ్స్ భారీ మార్జిన్‌తో గెలవడం అలవాటుగా మారింది. అయితే కాలం గిర్రున తిరిగింది. కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే క్రికెట్లో అనూహ్య మార్పులు వచ్చేశాయి. దీనికి కారణం లీగ్‌ల ప్రవేశమే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇన్స్పిరేషన్తో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లీగ్స్ పుట్టుకొచ్చాయి. పొట్టి లీగుల్లో వరల్డ్ క్లాస్ ప్లేయర్స్‌తో కలసి ఆడుతూ పసికూన జట్ల ఆటగాళ్లు గేమ్‌కు సంబంధించిన మరిన్ని టెక్నిక్స్ నేర్చుకున్నారు. తమ ఆటను ఇంప్రూవ్ చేసుకున్నారు. టెక్నికల్‌గా మరింత స్ట్రాంగ్ అయ్యారు.
ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే సత్తా ఉన్నప్పటికీ గేమ్ మెచ్యూరిటీ, టెక్నిక్ లేక ఇన్నాళ్లూ పసికూన జట్లు అన్నా, అందులోని ప్లేయర్లు అన్నా చిన్నచూపు ఉండేది. కానీ ఇప్పుడంతా మారిపోయింది. రషీద్ ఖాన్ లాంటి వాళ్లు ఇప్పుడు స్టార్ క్రికెటర్లుగా మారారు. ఈ వరల్డ్ కప్‌లో ఆఫ్ఘానిస్థాన్, నెదర్లాండ్స్ లాంటి ఛోటా టీమ్స్‌తో ఆడాలంటే అందరూ భయపడుతున్నారు. అందుకు కారణం ఆ రెండూ ఫేవరెట్ టీమ్స్‌కు షాక్ ఇవ్వడమే. ఇటీవల జరిగిన మ్యాచుల్లో ఇంగ్లండ్‌ను ఆఫ్ఘాన్ ఓడించగా.. సౌతాఫ్రికాను డచ్ టీమ్ చిత్తు చేసింది. పసికూనలని తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ గెలుపుల ద్వారా వార్నింగ్ బెల్స్ మోగించాయి.
సౌతాఫ్రికాపై తాము సాధించిన విజయం గాలివాటం కాదని నిరూపించే పనిలో ఉన్న నెదర్లాండ్స్.. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుతంగా ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన డచ్ టీమ్ ఒక దశలో 91 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయింది. అయితే సైబ్రండ్ ఎంగెల్బ్రెట్ (70), లోగాన్ వ్యాన్ బీక్ (59) అద్భుతమైన పార్ట్నర్షిప్తో ప్రత్యర్థి ముందు 262 రన్స్ టార్గెట్‌ను ఉంచింది. వీళ్లిద్దరూ కలసి ఏడో వికెట్‌కు 135 రన్స్ జోడించారు. 48 ఏళ్ల వరల్డ్ కప్ హిస్టరీలో 7వ వికెట్‌కు ఇదే అత్యధిక పార్ట్నర్ష్ కావడం విశేషం.
ఆస్ట్రేలియా, టీమిండియా లాంటి పెద్ద జట్లు కూడా ఈ ఫీట్‌ను నమోదు చేయలేదు. దీంతో ఆసీస్, భారత్ వల్ల కానిది నెదర్లాండ్స్ సాధించిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లోనూ ఇలాగే 112కే 6 వికెట్లు పడిపోయిన దశ నుంచి కోలుకొని 245 రన్స్ చేసింది నెదర్లాండ్స్. సఫారీలతో చేసినట్లే లంక మీదా బౌలింగ్ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తే డచ్ టీమ్ మరో సంచలనం సృష్టించడం ఖాయం. మరి.. నెదర్లాండ్స్ ఆటతీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బాబర్ కి తలనొప్పిగా మారిన కోహ్లీ! ఫ్యాన్స్ చేతే తిట్టిస్తూ!
Netherlands added 135 runs for the 7th wicket.
– Highest in 48 year old World Cup history…..!!!! pic.twitter.com/aVoVfpJQVq
— Johns. (@CricCrazyJohns) October 21, 2023
Netherlands – 112/6 to 245/8 vs SA.
Netherlands – 91/6 to 262/10 vs SL.The Netherlands has been an inspiration in tough situations…..!!!! pic.twitter.com/pEOq1Isn9a
— Johns. (@CricCrazyJohns) October 21, 2023