గేల్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ.. ICC టోర్నమెంట్స్ హిస్టరీలోనే..!

  • Author singhj Published - 11:31 AM, Mon - 6 November 23

విరాట్ కోహ్లీ ఆడితే రికార్డులకు మూడినట్లేనని మరోమారు ప్రూవ్ అయింది. సౌతాఫ్రికాపై సెంచరీ బాదిన కింగ్ కోహ్లీ.. ఒకే మ్యాచ్​తో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

విరాట్ కోహ్లీ ఆడితే రికార్డులకు మూడినట్లేనని మరోమారు ప్రూవ్ అయింది. సౌతాఫ్రికాపై సెంచరీ బాదిన కింగ్ కోహ్లీ.. ఒకే మ్యాచ్​తో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

  • Author singhj Published - 11:31 AM, Mon - 6 November 23

విరాట్ కోహ్లీ.. అతడి బ్యాట్ గర్జించని మ్యాచ్ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎప్పుడో గానీ కోహ్లీ ఫెయిల్ అవ్వడు. ఒకవేళ ఒక మ్యాచ్​లో ఫెయిలైనా.. నెక్స్ట్ మ్యాచ్​కు దాని నుంచి బయటపడతాడు. పరుగుల వేట ఆగకుండా పక్కా ప్లానింగ్​తో బ్యాటింగ్ చేస్తాడు. కోహ్లీని ఇలా ఔట్ చేయొచ్చు, అతడి వీక్​నెస్ ఇదే అని ప్రత్యర్థులు అనుకుంటారు. కానీ తర్వాతి మ్యాచ్​లో ఆ బలహీనతను అధిగమించి.. అపోజిషన్ బౌలర్లకు ఛాయిస్ లేకుండా చేస్తాడు. అందుకే కోహ్లీని ఆపడం ఎవరి తరం కావడం లేదు. బౌండరీలు రాకపోతే సింగిల్స్, డబుల్స్​తో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడు. ఒక్కసారి మూమెంటమ్ దొరికితే భారీ షాట్లు కొడుతూ బౌలర్ల వెన్నులో దడపుట్టిస్తాడు.

గత 15 ఏళ్లుగా అలుపెరగకుండా పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లీ తన కెరీర్​లో 49వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు)తో సమానంగా నిలిచాడు. సౌతాఫ్రికాతో ఆదివారం మ్యాచ్​లో ఈ ఫీట్​ను నమోదు చేశాడు కోహ్లీ. స్లోగా ఉన్న ఈడెన్ గార్డెన్ పిచ్​పై బాల్ సరిగ్గా బ్యాట్​ మీదకు రాలేదు. దీంతో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారింది. ఈ టైమ్​లో రన్స్​ను పట్టించుకోకుండా కేవలం క్రీజులో సెటిలవ్వడం మీదే ఫోకస్ పెట్టాడు కోహ్లీ. ఒక్కసారి కుదురుకున్నాక బౌండరీలు కొడుతూ పోయాడు.

ఇలాంటి పిచ్​పై విరాట్ లాంటి బ్యాటర్ ఉన్నాడు కాబట్టే అంత స్కోర్ చేశామని.. లేకపోతే సాధ్యం కాదని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. దీన్ని బట్టే విరాట్ ఆడిన ఇన్నింగ్స్ ఎంత స్పెషల్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్​తో ఎన్నో రికార్డులను తన పేరిటి లిఖించుకున్నాడు కింగ్ కోహ్లీ. సెంచరీ చేసిన విరాట్​కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐసీసీ టోర్నమెంట్ మ్యాచుల్లో కోహ్లీకి ఇది 12వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కావడం విశేషం. తద్వారా ఐసీసీ టోర్నీల్లో 11 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న విండీస్ లెజెండ్ క్రిస్ గేల్ పేరు మీద ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాపై కోహ్లీకి ఇది ఐదో సెంచరీ. సఫారీ టీమ్​పై ఐదు సెంచరీలు చేసిన వార్నర్, సచిన్ సరసన అతడు ప్లేస్ దక్కించుకున్నాడు. మరి.. కోహ్లీ రికార్డులపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బాబర్ పై నిప్పులు చెరిగిన అక్తర్.. నిజంగా అది పరమ చెత్త నిర్ణయం అంటూ..!

Show comments