T20 World Cup: టీమిండియాతో మ్యాచ్‌లో మా ప్లాన్‌ ఇదే: పాక్‌ కెప్టెన్‌ బాబర్‌

T20 World Cup: టీమిండియాతో మ్యాచ్‌లో మా ప్లాన్‌ ఇదే: పాక్‌ కెప్టెన్‌ బాబర్‌

Babar Azam, IND vs PAK, T20 World Cup 2024: ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం అంతా ఎదురుచూస్తున్న క్రమంలో.. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ ఇండియాపై మా ప్లాన్స్‌ ఇవే అంటూ పేర్కొన్నాడు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Babar Azam, IND vs PAK, T20 World Cup 2024: ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం అంతా ఎదురుచూస్తున్న క్రమంలో.. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ ఇండియాపై మా ప్లాన్స్‌ ఇవే అంటూ పేర్కొన్నాడు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో అందరు ఎదురుచూస్తున్న మ్యాచ్‌ ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాక్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు కళ్లు కాయలు కాసేలా వేయిట్‌ చేస్తున్నారు. జూన్‌ 9 న్యూయార్క్‌లోని నసావు కౌంటి క్రికెట్‌ స్టేడియంలో ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కంటే ముందు ఇండియా, పాకిస్థాన్‌ చెరో మ్యాచ్‌ ఆడేస్తాయి. జూన్‌ 5న ఇండియా, ఐర్లాండ్‌తో మ్యాచ్‌ ఆడుతుండగా, జూన్‌ 6న అమెరికాతో పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఆడనుంది. అయితే.. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ ఫ్యాన్స్‌ సిద్ధం అవుతున్నట్లే.. రెండు జట్లు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ఇండియాతో మ్యాచ్‌లో తమ ప్లానింగ్‌ ఎలా ఉండబోతుందో వెల్లడించాడు.

బాబర్‌ ఆజమ్‌ మాట్లాడుతూ..‘భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ చర్చలో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆ మ్యాచ్‌కు ఉండే క్రేజ్‌ అలాంటిది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అనగానే రెండు టీమ్స్‌ ఆటగాళ్లు విభిన్న వైబ్స్‌, ఎనర్జీని పొందుతారు. ప్రతి ఒక్కరూ తమ దేశానికి మద్దతివ్వడం వల్ల ఆ మ్యాచ్‌పైనే అందరి ఫోకస్‌ ఉంటుంది. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ఉండే ప్రెజర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి సమయంలో బెసిక్స్‌కి కట్టుబడి ఉంటాం. మా క్రికెట్‌ మేం​ ఆడతాం’ అంటూ బాబర్‌ పేర్కొన్నాడు. ఒత్తిడి అధికంగా ఉంటే ఈ మ్యాచ్‌లో మీరు ప్రశాంతంగా ఉంటేనే విజయం సాధిస్తారని బాబర్‌ అన్నాడు.

అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియాపై పాకిస్థాన్‌కు అంత మంచి రికార్డ్‌ లేదు. ఒక్క 2021 టీ20 వరల్డ్‌ కప్‌లో తప్పితే.. ఏ వరల్డ్‌ కప్‌ టోర్నీలో కూడా ఇండియాపై పాక్‌ గెలిచిన చరిత్ర లేదు. టీ20 వరల్డ్‌ కప్స్‌లో ఇండియా-పాకిస్థాన్‌ జట్లు ఇప్పటి వరకు ఏడు సార్లు తలపడ్డాయి. 2007లో లీగ్‌ దశలో అలాగే ఫైనల​్‌లో ఈ రెండు టీమ్స్‌ పోటీ పడ్డాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ ఇండియానే గెలిచింది. అలాగే 2012, 2014, 2016, 2022 వరల్డ​్‌ కప్స్‌లో ఇండియానే పైచేయి సాధించింది. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో పాకిస్థాన్‌ ఇండియా చేతిలో ఓడినా.. ఫైనల్‌ వరకు చేరుకుంది. ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో రన్నరప్‌గా నిలిచింది. కానీ, వన్డే వరల్డ్‌కప్‌ 2023 తర్వాత పాకిస్థాన్‌ కెప్టెన్‌గా బాబర్‌ రాజీనామా చేసినా.. తిరిగి అతనికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు. మరి ఈ క్రమంలోనే ఇండియాతో మ్యాచ్‌లో తాము బేసిక్స్‌కి స్టిక్‌ అయి, కూల్‌గా ఆడతాం అంటూ బాబర్‌ ఆజమ్‌ పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments