IND vs SA: ఫైనల్‌ కోసం రన్స్‌ దాస్తున్నాడు.. అతనే మమ్మల్ని గెలిపిస్తాడు: రోహిత్‌

IND vs SA: ఫైనల్‌ కోసం రన్స్‌ దాస్తున్నాడు.. అతనే మమ్మల్ని గెలిపిస్తాడు: రోహిత్‌

Virat Kohli, Rohit Sharma, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా దూసుకెళ్తోంది. మరొక్క మ్యాచ్‌ గెలిస్తే చాలు.. కప్పు మనదే. అయితే.. ఫైనల్లో టీమిండియాను గెలిపి, కప్పు అందించే ప్లేయర్‌ అతనే అంటే రోహిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి ఆ ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, Rohit Sharma, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా దూసుకెళ్తోంది. మరొక్క మ్యాచ్‌ గెలిస్తే చాలు.. కప్పు మనదే. అయితే.. ఫైనల్లో టీమిండియాను గెలిపి, కప్పు అందించే ప్లేయర్‌ అతనే అంటే రోహిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి ఆ ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీలో టీమిండియా ఫైనల్‌కు వెళ్లింది. గురువారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. శనివారం సౌతాఫ్రికాతో టైటిల్‌ కోసం పోటీ పడనుంది రోహిత్‌ సేన. సెమీ ఫైనల్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌ జట్టును మట్టి కరిపించడంలో రోహిత్‌ శర్మ పాత్ర ఎంతో ఉంది. బ్యాటింగ్‌కు కష్టమైన స్లో పిచ్‌పై అద్భుతమైన బ్యాటింగ్‌తో కళ్లు చెదిరే షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు రోహిత్‌. పైగా తన ఓపెనింగ్‌ పార్ట్నర్‌ విరాట్‌ కోహ్లీ 9 పరుగులు మాత్రమే చేసి అవుటైనా, వన్‌ డౌన్‌లో వచ్చిన పంత్‌ విఫలమైనా.. రోహిత్‌ మాత్రం తన బాదుడు ఆపలేదు సరికాదా.. మరింత డోస్‌ పెంచాడు. అయితే.. ఫైనల్‌లో మాత్రం తమను గెలిపించే ప్లేయర్‌ ఒకడున్నాడంటూ రోహిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ టీ20 వరల్డ్‌ కప్‌ కోసం రోహిత్‌ శర్మకు జోడీగా యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేశారు. కానీ, అతన్ని పూర్తిగా పక్కనపెట్టి విరాట్‌ కోహ్లీని ఓపెనర్‌గా ఆడిస్తున్నారు. కానీ, కోహ్లీ మాత్రం విఫలం అవుతున్నాడు. ఈ టోర్నీలోకి బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్‌ 8 మ్యాచ్‌లో 37 పరుగులు చేసి రాణించిన కోహ్లీ.. మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ విఫలం అయ్యాడు. ఏకంగా రెండు డకౌట్లు ఉన్నాయి అని ఖాతాలో. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో కూడా కోహ్లీ దారుణంగా విఫలం అయ్యాడు. కేవలం 9 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. ఇలా బ్యాడ్‌ ఫామ్‌లో కొనసాగుతున్న కోహ్లీని బ్యాక్‌ చేస్తారా అంటూ రోహిత్‌ శర్మను ప్రజెంటర్‌ ప్రశ్నించాడు.

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. కోహ్లీని సపోర్ట్‌ చేస్తారా అని ఎదురైన ప్రశ్నకు రోహిత్‌ శర్మ సమాధానం ఇస్తూ.. ‘కచ్చితంగా.. విరాట్‌ ఒక క్లాస్‌ ప్లేయర్‌, అతనో బిగ్‌ మ్యాచ్‌ ప్లేయర్‌. ప్రతి ఆటగాడి కెరీర్‌లో ఇలాంటి ఒక ఫేజ్‌ ఉంటుంది. అయినా.. కోహ్లీ విషయంలో ఫామ్‌ అనేది పెద్ద విషయం కాదు. ఫైనల్స్‌ కోసం అతను దాస్తున్నాడు(పరుగులు)’ అంటూ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. ఒక కెప్టెన్‌గా తన టీమ్‌లోని ప్రధాన ప్లేయర్‌కు రోహిత్‌ అందించే సపోర్ట్‌ చూసి క్రికెట్‌ అభిమానుల మెచ్చకుంటున్నారు. అయితే.. ఒక్కసారి కోహ్లీ పరుగులు చేయడం స్టార్ట్‌ చేస్తే.. ఎలా ఆడతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని క్రికెట్‌ అభిమానులు కూడా అంటున్నారు. మరి కోహ్లీ విషయంలో రోహిత్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments