Ishan Kishan TeamIndia:25 ఏళ్ళ వయసులో ఇషాన్ కిషన్ కి ఇలాంటి సమస్యా? ఏమైందంటే?

25 ఏళ్ళ వయసులో ఇషాన్ కిషన్ కి ఇలాంటి సమస్యా? ఏమైందంటే?

మానసిక అలసటకు గురైన ఇషాన్ కిషన్ సఫారీలతో జరిగే టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. 25 ఏళ్ళ వయసులో ఇషాన్ కిషన్ మానసిక సమస్యలతో బాధపడడానికి గల కారణం ఏంటి?

మానసిక అలసటకు గురైన ఇషాన్ కిషన్ సఫారీలతో జరిగే టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. 25 ఏళ్ళ వయసులో ఇషాన్ కిషన్ మానసిక సమస్యలతో బాధపడడానికి గల కారణం ఏంటి?

టీమిండియా యువ ప్లేయర్ ఇషాన్ కిషన్ తనకు విశ్రాంతి కావాలని బీసీసీఐని కోరాడు. వ్యక్తిగత కారణాలతో తను అందుబాటులో ఉండనని వెల్లడించాడు. దీంతో సఫారీలతో జరుగబోయే టెస్ట్ సిరీస్ నుంచి ఇషాన్ కు విశ్రాంతి కల్పించారు. అయితే అకాశం వచ్చిన ప్రతి సారి వికెట్ కీపర్ గా బ్యాటర్ గా జట్టులో తాన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు ఇషాన్ కిషన్. కాగా ఇషాన్ కిషన్ ఆటకు విరామం ఇవ్వడానికి గల కారణం అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోందని పలు వార్త సంస్థలు వెల్లడిస్తున్నాయి. కాగా 25 ఏళ్ల ఇషాన్ కిషన్ ఇంత చిన్న వయసులోనే మానసికంగా అలసిపోవడం ఏంటన్నది అంతా చర్చనీయాంశంగా మారింది.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పలు ఫార్మాట్ లలో క్రికెటర్ ఇషాన్ పలు మ్యాచ్ లలో ఆడి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో కూడా జట్టులో అవకాశం వచ్చినప్పుడల్లా మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇషాన్ వరల్డ్ కప్ లో ఎక్కువ శాతం బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇలా ఏడాదిన్నరపాటు తాను కుటుంబానికి దూరంగా టీమిండియా జట్టుతోనే ట్రావెల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాను మానసికంగా అలసిపోయినట్లు తెలుస్తోంది. ఇదేమీ పెద్ద సమస్య కాకపోయినప్పటకీ అసలు 25 ఏళ్ల వయసులో మెంటల్ గా ఫిజికల్ గా ఫిట్ నెస్ ఉండాల్సింది పోయి అలసటకు గురవ్వడం ఏంటన్నది అందరినీ ఆలోచనల్లో పడేసింది.

ఒకప్పుడు జట్టులో చోటు దక్కితే కనీసం 20 నుంచి 30 మ్యాచ్ లు ఆడే వరకు ఆటగాడిపై ఒత్తిడి ఉండేది కాదు. ఒకప్పటి టీమిండియా దిగ్గజ ప్లేయర్స్ సచిన్ తెందూల్కర్, గంగూళీ, ద్రావిడ్, యువరాజ్, సెహ్వాగ్ ఇలా కొంత మంది ఆటగాళ్లు స్వేచ్చగా ఆడేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఒక్క మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శన చేయకపోతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ప్లేయర్స్ పై ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఇది ఒక్క ఇషాన్ కు మాత్రమే ఉన్న సమస్య కాదు. దేశంలోని యువత ఎదుర్కొంటున్న సమస్య. కెరీర్ లో స్థిరపడాలని, డబ్బు బాగా సంపాదించాలని మెంటల్ ప్రెజర్ కు లోనవుతున్నారు. ప్లేయర్లపై ఒత్తిడి పడకుండా బీసీసీఐ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని పలువురు క్రికెట్ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Show comments