Ravichandran Ashwin: టీమిండియాలో అతడే రియల్ బాస్.. అంతకుమించిన డేంజరస్ ప్లేయర్ లేడు: అశ్విన్

భారత క్రికెట్ జట్టులో అతడే రియల్ బాస్ అని స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. అతడ్ని మించిన డేంజరస్ ప్లేయర్ లేరన్నాడు. అశ్విన్ ఎవరి గురించి అలా మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత క్రికెట్ జట్టులో అతడే రియల్ బాస్ అని స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. అతడ్ని మించిన డేంజరస్ ప్లేయర్ లేరన్నాడు. అశ్విన్ ఎవరి గురించి అలా మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆప్ఘానిస్థాన్​ సిరీస్​ను సక్సెస్​ఫుల్​గా ముగించిన టీమిండియా నెక్స్ట్ మరో ఆసక్తికర సిరీస్​కు సన్నద్ధమవుతోంది. ఇంగ్లండ్​ జట్టుతో 5 టెస్టులు ఆడేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్​లోని తొలి రెండు మ్యాచుల్లో ఆడే స్క్వాడ్​ను బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్​లో ఇంగ్లీష్ టీమ్​ను చిత్తు చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్​కు ఎగబాకాలని చూస్తోంది. సౌతాఫ్రికా టూర్​ను సక్సెస్​ఫుగా కంప్లీట్ చేసుకొని రావడం, మూడు టీ20 సిరీస్​లో ఆఫ్ఘాన్​ను 3-0తో వైట్​వాష్ చేయడంతో రోహిత్ సేన ఫుల్ జోష్​లో ఉంది. కెప్టెన్ హిట్​మ్యాన్ తన ఫామ్​ను మళ్లీ అందుకున్నాడు. వన్డే వరల్డ్ కప్​ ఓటమి, ముంబై సారథ్యం నుంచి తొలగించడంతో కొన్నాళ్లు బాధలో ఉన్న రోహిత్ మళ్లీ నార్మల్​గా కనిపిస్తున్నాడు. ఆఫ్ఘాన్​తో ఆఖరి మ్యాచ్​లో సెంచరీతో చెలరేగడం, కెప్టెన్​గా తెలివైన నిర్ణయాలతో జట్టును గెలిపించడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అలాంటి రోహిత్​ను సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పొగడ్తల్లో ముంచెత్తాడు.

టీమిండియాలో రోహితే రియల్ బాస్ అన్నాడు అశ్విన్. అతడ్ని మించిన డేంజరస్ ప్లేయర్ మరొకడు లేడన్నాడు. టీ20 క్రికెట్​లో చివరి 4 ఓవర్లలో హిట్​మ్యాన్​కు బౌలింగ్ చేయడం చాలా కష్టమన్నాడు. ఆఫ్ఘాన్​పై మూడో టీ20లో అతడు ఆడిన తీరు సూపర్బ్ అని మెచ్చుకున్నాడు. ‘ఆ మ్యాచ్​లో అన్నింటి కంటే హైలైట్ అంటే రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్సే. భారత జట్టు 30 పరుగుల్లోపే 4 వికెట్లు కోల్పోయిన సమయంలో అతడు ఆదుకున్నాడు. పరిస్థితులకు తగ్గట్లు తన బ్యాటింగ్​ను మార్చుకున్నాడు. మొదట్లో మెళ్లిగా ఆడినా ఆఖర్లో ఇన్నింగ్స్​ను ముగించిన తీరు అద్భుతం. తాను రియల్ బాస్ అని అతడు మరోమారు ప్రూవ్ చేశాడు. ఫైనల్ ఓవర్స్​లో అతడ్ని మించిన డేంజర్ బ్యాటర్ మరొకరు లేరు. చివరి నాలుగు ఓవర్లలో రోహిత్​కు బౌలింగ్ చేయడం అసాధ్యం. ఈ విషయాన్ని నేను ఇంతకుముందు ఓసారి చెప్పా, ఇప్పుడు మళ్లీ చెబుతున్నా. ఎంతటి తోపు బౌలర్ అయినా సరే.. రోహిత్​కు ఆఖర్లో బౌలింగ్ చేయడం ఇంపాజిబుల్ టాస్క్’ అని అశ్విన్ స్పష్టం చేశాడు.

డెత్ ఓవర్లలో బౌలర్లను అటాక్ చేసి పరుగులు పిండుకునేందుకు రోహిత్ దగ్గర అన్ని రకాల షాట్స్ ఉన్నాయని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ‘డెత్ ఓవర్లలో బౌలర్లను డామినేట్ చేసేందుకు రోహిత్ వద్ద అన్ని రకాల షాట్స్ ఉన్నాయి. లెంగ్త్ బాల్స్ వేస్తే పుల్ షాట్​తో బౌండరీకి తరలిస్తాడు. శరీరాన్ని టార్గెట్ చేసుకొని బాల్స్ వేసినా దాన్ని పికప్ చేసి పుల్ షాట్​గా మలిచే సత్తా అతడికి ఉంది. పరుగులు తప్పించుకునేందుకు వికెట్ల ముందు కాస్త వైడ్​గా బాల్ వేస్తే కవర్స్ మీదుగా లాఫ్టెడ్ షాట్​ కొడతాడు. ఒకవేళ యార్కర్ మిస్సయ్యారా.. అది కచ్చితంగా సిక్సే. ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన ఆఖరి టీ20లో సూపర్ ఓవర్​లోనే కాదు అతడు చాలా సార్లు భారీ సిక్సులు బాది టీమ్​ను అలవోకగా గెలిపించాడు. న్యూజిలాండ్ టీమ్​ను వాళ్ల సొంతగడ్డ మీద ఓడించాం. అప్పుడు టిమ్ సౌతీ బౌలింగ్​లో రోహిత్ అలవోకగా భారీ సిక్సులు బాదాడు’ అని అశ్విన్ గుర్తుచేసుకున్నాడు. మరి.. రోహితే రియల్ బాస్ అంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments