Nidhan
టీమిండియా మీద విషం చిమ్మాడో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్. త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ సేన సెమీస్‌కు కూడా రాదంటూ అహంకారంగా మాట్లాడాడు.
టీమిండియా మీద విషం చిమ్మాడో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్. త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ సేన సెమీస్‌కు కూడా రాదంటూ అహంకారంగా మాట్లాడాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 సందడి అప్పుడే మొదలైపోయింది. మెగా టోర్నీ మొదలవడానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది. కానీ స్క్వాడ్ అనౌన్స్మెంట్ టైమ్ వచ్చేయడంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా ఐపీఎల్ మీద నుంచి ప్రపంచ కప్‌పై ఫోకస్‌ను షిఫ్ట్ చేశారు. ఏ టీమ్ ఎలా ఉంటుంది? ఏయే ఆటగాళ్లకు ఛాన్స్ దక్కుతుంది? అనేది డిస్కస్ చేసుకున్నారు. ఇది జరుగుతున్న సమయంలోనే ఒక్కో దేశం తమ వరల్డ్ కప్ టీమ్‌ను ప్రకటిస్తూ వస్తోంది. తొలుత న్యూజిలాండ్ ఆ తర్వాత ఇంగ్లండ్, సౌతాఫ్రికా, టీమిండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్థాన్‌లు తమ స్క్వాడ్స్ ప్రకటించాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ ఏ టీమ్ కూడా తగ్గట్లేదని, అన్నీ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయని అంటున్నారు. ఈ తరుణంలో ఓ ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ భారత జట్టు మీద విషం చిమ్మాడు.
టీమిండియా మీద ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌కు కూడా రోహిత్ సేన రాదంటూ అహంకారపు వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లు పొట్టి ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు వాన్. భారత జట్టు ఫైనల్ ఫోర్కు చేరడం చాలా కష్టమని పరోక్షంగా పేర్కొన్నాడతను. టీమిండియా వరల్డ్ కప్ జర్నీ గురించి వాన్ చెప్పిన జోస్యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అతడి మీద భారత అభిమానులు మండిపడుతున్నారు. వాన్‌కు మైండ్ లేదని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ సీరియస్ అవుతున్నారు.
టీ20ల్లో నంబర్ వన్ ప్లేయర్ అయిన సూర్యకుమార్ యాదవ్, ప్రస్తుత క్రికెట్లో తోపులు అయిన రోహిత్, కోహ్లీ, బుమ్రా లాంటి ప్లేయర్లు ఉన్న టీమ్ మీద ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని అంటున్నారు. టీమిండియా అంటే వాన్‌కు ముందు నుంచి పడదని, అందుకే వీలు దొరికినప్పుడల్లా ఇలా విషం చిమ్ముతుంటాడని చెబుతున్నారు. భారత్ లాంటి బలమైన జట్టు ఏ ప్రాతిపదికన సెమీస్ చేరదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అశాస్త్రీయమైన అంచనాలు వేయడం మానేయాలని, టీమిండియా ఈసారి కప్పు గెలుస్తుంది చూస్కో అంటూ సవాల్ విసురుతున్నారు. ట్రోఫీ గెలిచాక వాన్ సంగతి తేలుస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. భారత్ కాదు.. ముందు ఇంగ్లండ్ టీమ్ గురించి చూసుకోవాలని సూచిస్తున్నారు. మరి.. భారత్ వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్లదంటూ వాన్ చెప్పిన జోస్యం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Michael Vaughan picks his Top 4 Semifinalists of this T20 World Cup 2024:
– England.
– Australia.
– South Africa.
– West Indies. pic.twitter.com/8lJgvnugaV— Tanuj Singh (@ImTanujSingh) May 1, 2024