T20 World Cup 2024 Rohit Sharma On Captaincy: టీమ్​ను గెలిపించడం కంటే రియల్ ఛాలెంజ్ అదే.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Rohit Sharma: టీమ్​ను గెలిపించడం కంటే రియల్ ఛాలెంజ్ అదే.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీ20 వరల్డ్ కప్-2024 మీద కన్నేసింది టీమిండియా. వన్డే ప్రపంచ కప్ తృటిలో చేజారడంతో పొట్టి కప్పును ఎగరేసుకుపోవాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

టీ20 వరల్డ్ కప్-2024 మీద కన్నేసింది టీమిండియా. వన్డే ప్రపంచ కప్ తృటిలో చేజారడంతో పొట్టి కప్పును ఎగరేసుకుపోవాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో బిగ్ ఛాలెంజ్​కు సిద్ధమవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్-2024కు అతడు సమాయత్తం అవుతున్నాడు. మెగా టోర్నీలో భారత్​ను విజేతగా నిలపాలని భావిస్తున్నాడు. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్​-2023లో ఆఖరి మెట్టుపై బోల్తా పడింది టీమిండియా. కొద్దిలో కప్పు మిస్సవడంతో చాన్నాళ్లు బయటకు రాలేదు హిట్​మ్యాన్. సౌతాఫ్రికా, ఇంగ్లండ్​ సిరీస్​ల్లో ఆడి క్రమంగా ఆ బాధ నుంచి బయటపడ్డాడు. అయితే తక్కువ టైమ్​లోనే టీ20 వరల్డ్ కప్​ రూపంలో మరోసారి ఛాంపియన్​గా నిలిచే అవకాశం రావడంతో దీన్ని అస్సలు వదలొద్దని అతడు ఫిక్స్ అయ్యాడు. ఆసీస్ సహా మిగతా టాప్ టీమ్స్​ను కంగుతినిపించి కప్పును ఎగరేసుకుపోవాలని చూస్తున్నాడు.

టీ20 వరల్డ్ కప్​పై కన్నేసిన రోహిత్ ఇప్పటికే యూఎస్​ఏకు చేరుకున్నాడు. తోటి ఆటగాళ్లతో కలసి కసిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అలాంటోడు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ గురించి అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సారథిగా జట్టును గెలిపించడం కంటే కూడా మరో బిగ్ ఛాలెంజ్ ఉందన్నాడు. అదే ఆటగాళ్లను హ్యాండిల్ చేయడమని తెలిపాడు. విభిన్నమైన వ్యక్తులను కలుపుకొని పోవడం అంత ఈజీ కాదన్నాడు. కానీ అలా చేస్తే సక్సెస్ అదే వస్తుందన్నాడు. ‘విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన ఆటగాళ్లందర్నీ కలుపుకొని పోవడం కెప్టెన్​గా నా ముందున్న అతి పెద్ద సవాల్. జట్టులోని ప్రతి వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది కెప్టెన్​గా నేను నేర్చుకున్న విషయాల్లో అతి పెద్దది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

టీమ్​లోని ప్రతి ప్లేయర్​కు సరైన ఇంపార్టెన్స్ ఇస్తానన్నాడు రోహిత్. ఎందుకంటే ఈ జట్టు​ తమది అనే ఫీలింగ్ ప్రతి ప్లేయర్​లో కలగాలని.. అందుకే అందరికీ ఒకే రీతిలో ప్రాధాన్యత ఇస్తున్నానని హిట్​మ్యాన్ స్పష్టం చేశాడు. ఇక, ఈ వరల్డ్ కప్​లో భారత జట్టుకు సంబంధించి కీలకంగా మారిన అంశాల్లో ఒకటి ఓపెనింగ్ స్లాట్. రోహిత్​తో కలసి ఎవరు ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. యశస్వి జైస్వాల్ రూపంలో సరైనోడు అందుబాటులో ఉన్నాడు. కానీ కొందరు మాజీ క్రికెటర్లు మాత్రం సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీని హిట్​మ్యాన్​కు జతగా ఓపెనర్​గా దింపాలని అంటున్నారు. ఐపీఎల్​లో అదరగొట్టిన కింగ్ ఆ ప్లేస్​కు సెట్ అవుతాడని చెబుతున్నారు. ఈ విషయంలో రోహిత్, టీమ్ మేనేజ్​మెంట్ కలసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Show comments