Somesekhar
జడేజా కారణంగానే సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ అయ్యాడని సోషల్ మీడియా వేదికగా జడ్డూను సెల్పిష్ అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. కాగా.. మ్యాచ్ అనంతరం రనౌట్ పై స్పందించాడు సర్ఫరాజ్.
జడేజా కారణంగానే సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ అయ్యాడని సోషల్ మీడియా వేదికగా జడ్డూను సెల్పిష్ అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. కాగా.. మ్యాచ్ అనంతరం రనౌట్ పై స్పందించాడు సర్ఫరాజ్.
Somesekhar
తనకొచ్చిన లక్కీ ఛాన్స్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం అన్ లక్కీ ఆటగాడిగా నిలిచాడు. దానికి కారణం మనందరికి తెలిసిందే. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో డెబ్యూ మ్యాచ్ లోనే 48 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు సర్ఫరాజ్ ఖాన్. కానీ 62 పరుగులు చేసి మంచి టచ్ లో ఉన్న అతడు రనౌట్ రూపంలో వెనుదిరగాల్సి వచ్చింది. జడేజా కారణంగానే అతడు రనౌట్ అయ్యాడని సోషల్ మీడియా వేదికగా జడ్డూను సెల్పిష్ అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. మ్యాచ్ అనంతరం రనౌట్ పై స్పందించాడు సర్ఫరాజ్.
టీమిండియాలోకి డెబ్యూ చేసిన ఆనందం సర్ఫరాజ్ ఖాన్ కు ఎక్కువసేపు లేకుండా పోయింది. తొలి మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డ్ ను పరుగులుపెట్టించాడు ఈ దేశవాలీ హీరో. అయితే ఫస్ట్ మ్యాచ్ తోనే టచ్ లోకి వచ్చిన ఈ చిచ్చరపిడుగు అనూహ్యంగా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఇదిలా ఉండగా.. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ పై స్పందించాడు.
“నేను జడ్డూ భాయ్ కు ముందునుంచి చెబుతూనే ఉన్నాను. బ్యాటింగ్ చేసేటప్పుడు నాతో ఎక్కువగా మాట్లాడమని. ఎందుకంటే? నాకు మాట్లాడుతూ బ్యాటింగ్ చేయడమంటే చాలా ఇష్టం. జడేజా సైతం నాకు ఈ మ్యాచ్ లో చాలా మద్ధతుగా నిలిచాడు. థ్యాక్యూ జడ్డూ భాయ్. ఇకపోతే.. అందరూ రనౌట్ గురించి మాట్లాడుతున్నారు. క్రికెట్ లో ఇలాంటివన్నీ సహజం” అంటూ చెప్పుకొచ్చాడు సర్ఫరాజ్ ఖాన్. కాగా.. రనౌట్ అయినందుకు నీకు బాధగా లేదా అని కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఖాన్ భాయ్ నువ్వు రనౌట్ కాకుంటే కచ్చితంగా సెంచరీ చేసేవాడివే అంటూ మరికొందరు క్రికెట్ లవర్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Sarfaraz Khan said “I told Jaddu Bhai to keep talking to me while I bat as I like talking while batting – he supported me a lot today”. [Sahil Malhotra from News18] pic.twitter.com/zgejEDPDRh
— Johns. (@CricCrazyJohns) February 15, 2024
ఇదికూడా చదవండి: సర్ఫరాజ్ రనౌట్‌కు అనిల్ కుంబ్లేనే కారణం! క్రేజీ సెంటిమెంట్..