Somesekhar
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఓటమి ఎఫెక్ట్ తో కెప్టెన్సీపై సంచలన కామెంట్స్ చేశాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఓటమి ఎఫెక్ట్ తో కెప్టెన్సీపై సంచలన కామెంట్స్ చేశాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Somesekhar
టీమిండియా ఆశలకు గండికొడుతూ.. తొలి టెస్ట్ లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆతిథ్య సౌతాఫ్రికా టీమ్. ఈ మ్యాచ్ లో మూకుమ్మడిగా విఫలం అయ్యారు భారత ఆటగాళ్లు. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే పేస్ కు అనుకూలించే సఫారీ పిచ్ లపై టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో ప్రోటీస్ గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ గెలవాలి అన్న భారత్ కు తీవ్ర నిరాశే మిగిలింది. ఇక ఈ ఓటమిపై స్పందించి.. విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఓటమి ఎఫెక్ట్ తో కెప్టెన్సీపై సంచలన కామెంట్స్ చేశాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా ఓడిపోవడం ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. సఫారీ గడ్డపై ఈ సిరీస్ గెలిచి.. సరికొత్త చరిత్ర సృష్టించాలని భావించిన భారత్ కు గట్టి షాకిచ్చింది ప్రోటీస్ టీమ్. తమ గడ్డపై తమను ఓడించడం అంత సులువైన విషయం కాదని మరోసారి ప్రపంచానికి రుజువుచేసింది. ఇదిలా ఉండగా.. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై పలు షాకింగ్ విషయాలు వెల్లడించాడు. సారథ్య బాధ్యతల గురించి హిట్ మ్యాన్ మాట్లాడుతూ..
“కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాకా అన్ని రోజులు విజయాలు రావు, అన్నిసార్లు సంతోషంగా ఉండలేం. కొన్ని కొన్ని సందర్భాల్లో ఓటములు మనల్ని బాధిస్తాయి. తాజాగా సౌతాఫ్రికా ఓటమి కూడా ఇలాంటిదే. అయితే ఒక కెప్టెన్ గా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు అండగా ఉండాలి. ప్లేయర్లకు బూస్ట్ ఇచ్చి.. నెక్ట్స్ మ్యాచ్ కు మానసికంగా సిద్దం చేయాలి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రోహిత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ తో పాటుగా టీమిండియా పరాజయానికి కారణాలు కూడా వెల్లడించాడు భారత సారథి. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లందరూ పూర్తిగా విఫలం అయ్యారని పేర్కొన్నాడు. అయితే కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్లలో చాలా మందికి సఫారీ గడ్డపై ఆడిన అనుభవం లేదని రోహిత్ చెప్పుకొచ్చాడు. మరి కెప్టెన్సీపై రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Following the Boxing Day Test loss against South Africa, Captain Rohit Sharma shares his perspective. pic.twitter.com/uJHjmWORu2
— CricTracker (@Cricketracker) December 28, 2023