రోహిత్‌ శర్మ గంభీర్‌కి భయపడుతున్నాడా? మరెందుకు ఈ నిర్ణయం?

Rohit Sharma, Gautam Gambhir, IND vs SL: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒక విషయంలో గౌతమ్‌ గంభీర్‌కి భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకు సంబంధించి రెండు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Gautam Gambhir, IND vs SL: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒక విషయంలో గౌతమ్‌ గంభీర్‌కి భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకు సంబంధించి రెండు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

దాదాపు 17 ఏళ్ల తర్వాత దేశానికి రెండో టీ20 వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ప్రశంసలు అందుకున్నాడు. భారత క్రికెట్‌ చరిత్రలో వరల్డ్‌ కప్‌ గెలిచిన మూడో కెప్టెన్‌గా నిలిచాడు. ఇంత సాధించినా.. కొత్తగా వచ్చిన హెడ్‌ కోచ్‌కు రోహిత్‌ శర్మ భయపడుతున్నాడా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటూ క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో పేర్కొంటున్నారు. అసలు రోహిత్‌ శర్మ గంభీర్‌కు ఎందుకు భయపడతాడు? వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? ప్రస్తుతం ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రోహిత్‌ శర్మ అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ శైలికి టెస్ట్‌, వన్డే ఫార్మాట్‌ కంటే టీ20 ఫార్మాటే సరిగ్గా సరిపోతుంది. కానీ, రోహిత్‌ టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన వెంటనే టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కానీ, తాజాగా తనను క్రికెట్‌ ఆడుతూ చాలా కాలం చూస్తారంటూ కీలక స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. తన ఫిట్‌నెస్‌పై అంత నమ్మకం ఉన్న రోహిత్‌ టీ20లకు ఎందుకు రిటైర్మెంట్‌ ఇచ్చినట్లు అని ఆలోచిస్తే.. దాని వెనుక గంభీర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అది ఎలాగంటే.. హెడ్‌ కోచ్‌గా రావాలంటే టీ20లకు యంగ్‌ టీమ్‌ కావాలని బీసీసీఐని గంభీర్‌ కోరినట్లు, అలాగే కెప్టెన్సీ మార్చాలని కూడా కోరినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. దానికి బీసీసీఐ ఓకే చెప్పి.. ఈ విషయంపై రోహిత్‌, కోహ్లీ, జడేజాతో ముందే మాట్లాడి.. టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు సమాచారం.

ఎలాగో వరల్డ్‌ కప్‌ గెలవడంతో ఇదే మంచి సమయం అనుకోని.. రిటైర్మెంట్‌ ప్రకటించేశారు. అప్పుడు రిటైర్మెంట్‌ ఇవ్వకుంటే ఆ తర్వాత టీ20 టీమ్‌ నుంచి బలవంతంగా తప్పిస్తే అవమానంగా భావించే బదులు గౌరవంగా తప్పుకుంటే బాగుంటుందని గంభీర్‌కు భయపడి ఇష్టలేకపోయినా రోహిత్‌ రిటైర్మెంట్‌ ఇచ్చాడని క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు. రిటైర్మెంట్‌ ఇచ్చిన చాలా రోజులకు ఈ టాపిక్‌ ఎందుకు చర్చకు వచ్చిందంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలే అందుకు కారణం.

టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టుకు రెస్ట్‌ ఇచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలో యంగ్‌ టీమిండియాను జింబాబ్వే పర్యటనకు పంపింది బీసీసీఐ. అయితే.. శ్రీలంకతో టీ20 తర్వాత జరగబోయే వన్డే సిరీస్‌కు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, బుమ్రాలకు రెస్ట్‌ ఇవ్వాలని కూడా బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా అందిన సమాచారం మేరకు రోహిత్‌ శర్మ శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటానని తనకు తానే స్వయంగా బీసీసీఐకి తెలిపినట్లు సమాచారం. ఇలా రోహిత్‌ తాను ఆడతానంటూ బీసీసీఐకి చెప్పడం వెనుక కూడా గంభీర్‌ భయం కనిపిస్తోంది. ఒక వేళ తాను ఆడకపోతే.. తన ప్లేస్‌లో యువ క్రికెటర్లు ఓపెనర్‌గా రాణించి, కెప్టెన్‌కే కేఎల్‌ రాహుల్‌ లేదా హార్ధిక్‌ పాండ్యా సక్సెస్‌ అయితే.. తన వన్డే కెప్టెన్సీ భవిష్యత్తుపై ఎక్కువ ప్రభావం చూపుతుందో అనే భయంతోనే రెస్ట్‌ అవసరం లేదని తాను శ్రీలంకతో సిరీస్‌ ఆడతానంటూ రోహిత్‌ శర్మ ముందుకు రావడం వెనుక కారణంగా కనిపిస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments