టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్‌పై ఇప్పుడు చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా టీ20 క్రికెట్‌కు హిట్‌మ్యాన్ దూరం కానున్నాడనే వార్త ఒకటి.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్‌పై ఇప్పుడు చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా టీ20 క్రికెట్‌కు హిట్‌మ్యాన్ దూరం కానున్నాడనే వార్త ఒకటి.
వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్లో భారత్ ఓటమిని ఫ్యాన్స్ ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అసలు ఆ మ్యాచ్‌లో మన జట్టు ఎలా ఓడిందంటూ అనాలసీస్ చేయడంలో మునిగిపోయారు. ఫైనల్ వరకు వరుస విజయాలతో అంత బాగా ఆడుతూ వచ్చిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడటంతో నిరాశలో కూరుకుపోయారు. బ్యాటింగ్ ఫెయిల్యూర్‌కు దారుణమైన ఫీల్డింగ్ తోడు కావడంతోనే కప్ చేజార్చుకుందని చెప్పొచ్చు. ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నామనే ఒత్తిడి మన జట్టు ప్లేయర్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. వికెట్లు పడకపోవడంతో ఒక టైమ్‌లో పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా స్టంప్స్‌ను తన చేతులతో పడేశాడు. మళ్లీ వెంటనే వాటిని ఉండాల్సిన ప్లేసులో ఉంచి వెళ్లిపోయాడు.
బౌండరీలను ఆపడంలో భారత ఫీల్డర్ల ఫెయిల్యూర్ కూడా ఫైనల్లో క్లారిటీగా కనిపించింది. డైవ్‌లు వేయకుండా ఫోర్లను ఈజీగా వదిలేశారు. బౌలింగ్‌లో వికెట్లు రాకపోవడం ఒకెత్తయితే 18 రన్స్ ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకోవడం మరొకెత్తనే చెప్పాలి. హార్దిక్ పాండ్యాకు రీప్లేస్‌గా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకపోవడం, మంచి పార్ట్మైట్ స్పిన్నర్స్ లేని లోటు కూడా కనిపించింది. మొత్తానికి అయ్యిందేదో అయిపోయింది.. ఇకనైనా వీటిని భర్తీ చేస్తూ టీమ్‌ను మరింత బలోపేతం చేయడంపై టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక, వరల్డ్ కప్ ముగియడంతో అందరి దృష్టి ఆస్ట్రేలియాతో జరిగే 5 టీ20ల సిరీస్ వైపు మళ్లింది. ఈ సిరీస్‌లో ఆడనున్న భారత జట్టుకు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
టీ20 వరల్డ్ కప్‌కు మరో 8 నెలల టైమ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఇక మీదట జరిగే సిరీస్‌ల్లో ప్లేయర్లు అందర్నీ పరీక్షించి.. ప్రపంచ కప్ స్క్వాడ్‌పై ఒక అంచనాకు రానున్నారు సెలక్టర్లు. అయితే టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా? అనే అనుమానాలు వస్తున్నాయి. చాన్నాళ్లుగా ఈ ఇద్దరు ప్లేయర్లు పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే త్వరలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఉండటం, ఆసియా కప్ నుంచి వరల్డ్ కప్ వరకు బిజీ షెడ్యూల్‌తో అలసిపోయారు. అందువల్లే ఆసీస్‌తో సిరీస్‌లో రోహిత్, విరాట్‌ను ఆడించట్లేదని ఊహాగానాలు వస్తున్నాయి. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ టీ20 కెరీర్ విషయంలో బీసీసీఐ ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేసిందట. టీ20 క్రికెట్‌కు దూరంగా ఉండాలని హిట్‌మ్యాన్ నిర్ణయించుకున్నాడట.
వన్డేల్లో మాత్రం కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాడట రోహిత్. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా చేరవేశాడని క్రికెట్ వర్గాల్లో వినికిడి. కానీ వైట్ బాల్ క్రికెట్లో హిట్‌మ్యాన్ కొనసాగింపు విషయంపై పూర్తి క్లారిటీ కోసం నేరుగా అతడితో డిస్కస్ చేసేందుకు బీసీసీఐ అధికారులు రెడీ అవుతున్నారని సమాచారం. అతి త్వరలో దీనిపై పూర్తి స్పష్టత రానుందని తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ టీ20లకు గుడ్‌బై చెబితే.. భారత జట్టు భవిష్యత్తు ఇద్దరు ప్లేయర్లపై డిపెండ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. వాళ్లే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా. రోహిత్ లేని లోటును వీళ్లిద్దరే పూడ్చాల్సి ఉంటుంది. టీ20ల్లో అటాకింగ్ గేమ్‌తో అదరగొట్టే సూర్య, ఆల్‌రౌండ్ ఎబిలిటీస్‌తో గెలుపులో కీలక పాత్ర పోషించే హార్దిక్ ఇక మీదట మరింత రెస్పాన్సిబిలిటీతో ఆడాలి. ముఖ్యంగా హిట్‌మ్యాన్ రోల్‌ను సూర్య తీసుకోవాలని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. మరి.. టీ20 క్రికెట్ నుంచి రోహిత్ దూరం అవుతాడనే వార్తలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సచిన్, సెహ్వాగ్ కాదు.. ధోనీనే తన ఫేవరెట్ అంటున్న గంభీర్!
Rohit Sharma pic.twitter.com/gFO4fTaR76
— RVCJ Media (@RVCJ_FB) November 22, 2023