గడ్డం.. వరల్డ్‌ కప్‌కు అడ్డమని రోహిత్‌ భావిస్తున్నాడా? ఇందులో నిజమెంతా?

ప్రస్తుతం టీమిండియా ముందున్న ప్రధాన లక్ష్యం ఒక్కటే.. స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌ 2023ను సాధించడం. ధోని కెప్టెన్సీలో 2011 వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమిండియా మళ్లీ వరల్డ్‌ కప్‌ను ముద్దాడలేదు. జట్టు పరంగా చూస్తే ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న భారత్‌.. ఐసీసీ ట్రోఫీల వరకు వస్తే మాత్రం చతికిలపడుతోంది. హాట్‌ ఫేవరేట్‌ టీమ్స్‌లో ఒకటిగా ఉంటున్న భారత్‌.. సెమీస్‌ వరకు వెళ్తోంది కానీ, కప్పు కొట్టలేకపోతుంది. 2023 వన్డే వరల్డ్‌ కప్‌లో మాత్రం అలాంటి పొరపాట్లు జరగకుండా.. ఈ సారి వరల్డ్‌ కప్‌ గెలవడమే లక్ష్యంగా ప్రణాళిక రచిస్తోంది.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ సారథ్యంలోనే టీమిండియాను చాలా కాలంగా వరల్డ్‌ కప్‌ కోసం సిద్ధం చేస్తున్నారు. వరల్డ్‌ కప్‌ కోసం ఆటగాళ్లు జాబితాను సిద్ధం చేసుకుని, వారికి అవకాశాలు ఇచ్చకుంటూ.. ఒక పటిష్టమైన టీమ్‌ను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్నా.. వారి టార్గెట్‌ మొత్తం వరల్డ్‌ కప్‌పైనే ఉంది. మరో నాలుగైదు నెలల్లో వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. అప్పటి వరకు జరిగే సిరీస్‌లను సన్నాహక మ్యాచుల్లాగా భావిస్తోంది. ఈ సిరీస్‌లో సాధ్యమైనంత వరకు ప్రయోగాలు చేస్తూ.. వరల్డ్‌ కప్‌ కోసం బెస్ట్‌ ఎలెవన్‌ను సిద్ధం చేయనున్నారు.

అయితే.. ఆట పరంగా టీమ్‌ను బలోపేతం చేస్తున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. వరల్డ్‌ కప్‌ కోసం కొన్ని సెంటిమెంట్లను సైతం నమ్ముతున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల రోహిత్‌ క్లీన్‌షేవ్‌తో కనిపించాడు. చాలా కాలంగా మంచి గుబురు గడ్డంతో ఉన్న రోహిత్‌.. తాజాగా గడ్డం తీసేసి.. యంగ్‌ లుక్‌లో కనిపించాడు. గడ్డం లేకుండా ఉన్న రోహిత్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే.. రోహిత్‌ గడ్డం వరల్డ్‌ కప్‌ కోసమే తీశాడనే వార్త వైరల్‌గా మారింది.

ఇప్పటి వరకు వరల్డ్‌ కప్‌ గెలిచిన ఏ కెప్టెన్‌కు కూడా గడ్డం లేదు. సో.. వరల్డ్‌ కప్‌ గెలవాలంటే గడ్డం ఉండొద్దని రోహిత్‌ భావించినట్లు తెలుస్తోంది. అందుకోసమే ఇప్పటి నుంచే క్లీన్‌ షేవ్‌ను అలవాటు చేసుకుంటున్నట్లు ఉన్నాడంటూ కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ, రోహిత్‌ ఏది చేసినా.. దేశం కోసమే చేస్తాడు కాబట్టి.. గడ్డం సెంటిమెంట్‌ వర్క్‌అవుటై ఇండియాకు వరల్డ్‌ కప్‌ వస్తే అంతకు మించి ఏం కావాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే.. వరల్డ్‌ కప్‌ నెగ్గాలంటే ఒత్తిడిని తట్టుకుని, అద్భుతంగా ఆడాలని అంతే కానీ ఇలా గడ్డాలు తీసేసి, గుడ్డలు మారిస్తే వరల్డ్‌ కప్‌ రాదని మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ధోని కావాలనే రనౌట్‌ అయ్యాడు: యువరాజ్‌ తండ్రి

Show comments