SNP
Rishabh Pant, MS Dhoni: భారత దిగ్గజ కెప్టెన్, మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి యువ క్రికెటర్ పంత్ మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యాడు. ఇంతకీ పంత్ ధోని గురించి ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..
Rishabh Pant, MS Dhoni: భారత దిగ్గజ కెప్టెన్, మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి యువ క్రికెటర్ పంత్ మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యాడు. ఇంతకీ పంత్ ధోని గురించి ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ సరైన టైమ్‌లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవుతున్న సమయంలో టీమిండియాలోకి వచ్చిన పంత్.. మరో ధోని అవుతాడా అనేలా ఆడి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. టీమిండియా తరఫున, ముఖ్యంగా టెస్టుల్లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో భారత క్రికెట్ భవిష్యత్తుగా కనిపించాడు. కానీ, 2022 డిసెంబర్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై.. చావు అంచుల వరకు వెళ్లి తిరిగొచ్చాడు. ఏడాది పాటు గాయాల నుంచి కోలుకుని ఐపీఎల్ 2024తో తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టి.. తాజాగా టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో భాగమయ్యాడు. ఈ క్రమంలో పంత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు.
తనకు ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే ధోని దగ్గరికి వెళ్లిపోతానని, ఆయనే తనకు మార్గం చూపిస్తాడంటూ చెప్పుకొచ్చాడు. పంత్ మాట్లాడుతూ.. ‘ఫీల్డ్‌లోనే కాదు, ఆఫ్ ది ఫీల్డ్‌లో కూడా.. నాకు ఏ సమస్య వచ్చినా, ఏదైన విషయంలో నేను అయోమయానికి గురైనా.. నేను ధోని అన్న దగ్గరికి వెళ్లి.. నా సమస్యను ఆయనతో చెప్పేస్తా. ఆ తర్వాత ఆయన పూర్తిగా దాని పూర్వాపరాలు వివరించి, ఏ నిర్ణయం తీసుకోవాలనే దాన్ని మనకే విడిచిపెడతారు. మన థాట్ ప్రాసెస్‌కు విలువ ఇస్తారు. నేను ఇది చెప్పాను కాబట్టి ఇదే చేయాలని ధోని చెప్పరు.’ అంటూ పంత్ పేర్కొన్నాడు.
అలాగే ధోని నుంచి ఏం నేర్చుకున్నారు అనే దాని గురించి మాట్లాడుతూ.. ‘ఒక దిగ్గజ వికెట్ కీపర్‌గా ధోని నుంచి ఎంతో నేర్చుకున్నాడు. ఆయన నుంచి ఏం నేర్చుకున్నానో ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నేను టీమిండియాలోకి వచ్చిన సమయంలో నా వయసు 18 ఏళ్లు. అప్పుడు కూడా ఆయన సీనియర్, జూనియర్ అనే భేదం లేకుండా ఎంతో ప్రేమగా చూసుకున్నారు. మనం జూనియర్స్ అనే విషయం మనకు తెలుస్తుంది. కానీ, ఒక దిగ్గజ క్రికెటర్‌గా ఆయన టీమ్‌లో అలాంటి వాతావరణం లేకుండా చూసుకున్నారు.’ అంటూ పంత్ వెల్లడించాడు. అయితే.. ధోని గొప్పతనం గురించి చెప్పుతున్న సమయంలో పంత్ కళ్లు కాస్త చెమ్మగిల్లాయి. ధోనితో పంత్ చాలా సన్నిహితంగా ఉంటాడనే విషయం తెలిసిందే. మరి ధోని గురించి పంత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rishabh Pant said, “whenever I’m confused or find myself in any trouble, I go to MS Dhoni bhaiya and he helps me everytime”. 🥹❤️pic.twitter.com/uiZqcSSfjQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 21, 2024