SNP
Rishabh Pant, Rohit Sharma, Jatin Paranjape, Suryakumar Yadav: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియాను ఆదుకుంటూ.. జట్టుకు బ్యాక్‌బోన్‌గా ఉంటే ఇద్దరు క్రికెటర్లు ఎవరో సీఏసీ సభ్యుడు జతిన్ వెల్లడించాడు. మరి వాళ్లిద్దరు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Rishabh Pant, Rohit Sharma, Jatin Paranjape, Suryakumar Yadav: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియాను ఆదుకుంటూ.. జట్టుకు బ్యాక్‌బోన్‌గా ఉంటే ఇద్దరు క్రికెటర్లు ఎవరో సీఏసీ సభ్యుడు జతిన్ వెల్లడించాడు. మరి వాళ్లిద్దరు ఎవరో ఇప్పుడు చూద్దాం..
SNP
ఇటీవలె ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచినందుకు భారత క్రికెట్ అభిమానులు ఎంతో సంతోష పడ్డారు. చాలా మంది రోడ్లపైకి వచ్చి సంబురాలు కూడా చేసుకున్నారు. అలాగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత.. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో చాలా మంది బాధపడ్డారు కూడా. ఇకపై ఆ ఇద్దరు గొప్ప బ్యాటర్లను టీ20 క్రికెట్‌లో టీమిండియా తరఫున చూడలేమా అంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు క్రికెట్ ఫ్యాన్స్. ఒకేసారి ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటిస్తే.. టీమిండియాను ఎవరు ఆదుకుంటారని కూడా కొంతమంది ప్రశ్నించారు. అయితే.. వాళ్లిద్దరి తర్వాత టీమిండియాకు టీ20 క్రికెట్‌లో బ్యాక్‌బోన్‌లా నిలిచే ఇద్దరు ప్లేయర్లు ఆల్రెడీ టీమ్‌లో ఉన్నారంటూ భారత మాజీ క్రికెటర్ జతిన్ పరంజపే అంటున్నారు.
టీమిండియా మాజీ క్రికెటర్‌గా, మాజీ సెలెక్టర్‌గా ప్రస్తుతం సీఏసీ(క్రికెట్ అడ్వైజరీ కమిటీ)లో సభ్యుడిగా ఉన్న జతిన్.. ప్రస్తుతం భారత జట్టుకు వెన్నెముకగా నిలిచే ప్లేయర్లు ఇద్దరు ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ, రోహిత్ తర్వాత.. ఆ రేంజ్‌లో ఇండియాకు అండగా ఉండే ప్లేయర్లుగా రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ పేర్లను ఆయన పేర్కొన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌తో టీమిండియా టీ20ల్లో ఒక్కసారిగా బలహీన పడినా.. ఆ బలహీనత ఎక్కువ కాలం కొనసాగదని ఆయన అన్నాడు.
ఎందుకంటే.. టీమిండియా భవిష్యత్తు అద్భుతమైన యువ క్రికెటర్ల చేతిలో ఉందని, టీ20ల్లో మూడో స్థానంలో రిషభ్ పంత్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడితే.. టీమిండియాకు ఇంక తిరుగు ఉండదని తెలిపాడు. భవిష్యత్తులో టీమిండియాకు పంత్, సూర్య బ్యాక్‌బోన్‌గా ఉంటారని, అలాగే ఐదో స్థానంలో ఆడే ప్లేయర్ ఎవరో నిర్ణయించుకుంటే.. టీమిండియా ఇప్పటిలాగే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని జతిన్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, టీ20ల్లో ఐదో స్థానంలో హార్ధిక్ పాండ్యా ఆడే అవకాశం ఎక్కువగా ఉంది. పైగా అతనే టీ20ల్లో టీమిండియాకు పర్మినెంట్ కెప్టెన్ కూడా అవుతాడని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. మరి టీమిండియాకు టీ20ల్లో పంత్, సూర్య వెన్నెముకగా ఉంటారని జతిన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rishabh Pant and Suryakumar Yadav Will Emerge as Indian Team’s New Backbone: Jatin Paranjape#SuryakumarYadav #RishabhPant pic.twitter.com/Cv92t18GuV
— Sayyad Nag Pasha (@nag_pasha) July 11, 2024