Somesekhar
ఆర్సీబీ ఫ్యాన్స్ నుంచి ఓ కొత్త డిమాండ్ బయలుదేరింది. అదేంటంటే? ఐపీఎల్ 2024 సీజన్ ను మళ్లీ మెుదటి నుంచి స్టార్ట్ చేయండని. మరి RCB ఫ్యాన్స్ వింత డిమాండ్ కు కారణం ఏంటో తెలుసా?
ఆర్సీబీ ఫ్యాన్స్ నుంచి ఓ కొత్త డిమాండ్ బయలుదేరింది. అదేంటంటే? ఐపీఎల్ 2024 సీజన్ ను మళ్లీ మెుదటి నుంచి స్టార్ట్ చేయండని. మరి RCB ఫ్యాన్స్ వింత డిమాండ్ కు కారణం ఏంటో తెలుసా?
Somesekhar
IPL చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన టీమ్ ఏదంటే? అందరూ తడుముకోకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని ఠక్కున చెబుతారు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా కప్ కొట్టలేక.. ఫ్యాన్స్ ను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తూ వస్తోంది. అయినప్పటికీ అభిమానులకు ఆర్సీబీపై ప్రేమ తగ్గడం లేదు. ఇక గత సంప్రదాయాన్నే కొనసాగిస్తూ.. ఈ ఐపీఎల్ సీజన్ లో కూడా వరుసగా పరాజయాల పాలవుతూ దాదాపు ప్లే ఆఫ్స్ కు దూరమైంది. అయితే చివరి దశలో మాత్రం అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు విజయాలు సాధించి.. అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్యాన్స్ నుంచి ఓ కొత్త డిమాండ్ బయలుదేరింది. అదేంటంటే? ఐపీఎల్ 2024 సీజన్ ను మళ్లీ మెుదటి నుంచి స్టార్ట్ చేయండని. మరి ఆర్సీబీ ఫ్యాన్స్ వింత డిమాండ్ కు కారణం ఏంటో తెలుసా?
గత సీజన్లలో చూపించిన దారుణ ప్రదర్శననే ఈ సీజన్లో కూడా కొనసాగించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. దాంతో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ ల్లో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉసూరుమంటోంది. అయితే గత రెండు మ్యాచ్ ల నుంచి గొప్పగా పుంజుకుంది ఆర్సీబీ. వరుసగా విజయాలు సాధిస్తూ.. ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మెున్న రికార్డుల మీద రికార్డ్ లు బద్దలు కొడుతూ భారీ స్కోర్లు చేస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ను 35 రన్స్ తో చిత్తు చేసింది.
ఇక నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 201 పరుగుల టార్గెట్ ను కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలోనే దంచికొట్టింది. ఈ రెండు మ్యాచ్ ల్లో ఆర్సీబీ పూర్తిగా కొత్త ఆటను కనబరిచింది. ప్రస్తుతం టీమ్ అంతా మంచి టచ్ లోకి వచ్చింది. గత రెండు మ్యాచ్ ల నుంచి ఆటగాళ్లు సమష్టిగా రాణిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లైన్ లోకి వచ్చారు. ఇక విరాట్ కోహ్లీ ఎలాగో పరుగుల వరదపారిస్తూ.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. విల్ జాక్స్ సైతం ఫామ్ లో ఉన్నాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ నుంచి సరికొత్త డిమాండ్ వస్తోంది. అదేంటంటే?
ఈ ఐపీఎల్ సీజన్ ను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మా ఆటగాళ్లు ఇప్పుడే టచ్ లోకి వచ్చారు కాబట్టి.. ఈ సీజన్ ను పునఃప్రారంభించండి అంటూ బీసీసీఐని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ వింత డిమాండ్ పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా ఆర్సీబీకి డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో వారు టీమ్ పై ఉన్న తమ అభిమానాన్ని ఈ డిమాండ్ ద్వారా వ్యక్త పరుస్తున్నారు. మరి ఈ ఐపీఎల్ సీజన్ ను మళ్లీ స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.