IND vs SA: నేడే ఫైనల్‌.. ఆ ముగ్గురు ప్లేయర్లతోనే టీమిండియాకు డేంజర్‌!

IND vs SA: నేడే ఫైనల్‌.. ఆ ముగ్గురు ప్లేయర్లతోనే టీమిండియాకు డేంజర్‌!

IND vs SA, T20 World Cup 2024, Final: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఇండియా, సౌతాఫ్రికా జట్లు రెడీ అయ్యాయి. అయితే ఫైనల్‌లో టీమిండియానే ఫేవరేట్‌గా ఉన్నా.. సౌతాఫ్రికాలోని ఓ ముగ్గురు ప్లేయర్ల నుంచి ముప్పు పొంచి ఉంది. ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు చూద్దాం..

IND vs SA, T20 World Cup 2024, Final: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఇండియా, సౌతాఫ్రికా జట్లు రెడీ అయ్యాయి. అయితే ఫైనల్‌లో టీమిండియానే ఫేవరేట్‌గా ఉన్నా.. సౌతాఫ్రికాలోని ఓ ముగ్గురు ప్లేయర్ల నుంచి ముప్పు పొంచి ఉంది. ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం అయింది. నేడు(శనివారం) బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఈ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. పొట్టి ప్రపంచ కప్పు కొట్టేందుకు ఇరు జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ గెలవాలని ప్రొటీస్‌ జట్టు.. రెండో సారి టీ20 వరల్డ్‌ కప్‌ను ముద్దాడాలని టీమిండియా పట్టుదలతో ఉన్నాయి. మరి ఈ రెండు జట్లలో ఎవరు విశ్వవిజేతగా నిలుస్తారో ఫైనల్‌తో తేలిపోనుంది. అయితే.. ఈ తుదిపోరులో టీమిండియానే హాట్‌ ఫేవరేట్‌గా ఉంది. కానీ, రోహిత్‌ సేనకు సౌతాఫ్రికాలోని ఓ ముగ్గరు ప్లేయర్ల నుంచి మాత్రం ముప్పు పొంచిఉంది.

మన ఎంత పటిష్టంగా ఉన్నా.. జట్టు మొత్తం మ్యాచ్‌ విన్నర్లతో నిండి ఉన్నా.. సౌతాఫ్రికాను అస్సలు తక్కువ అంచనా వేయాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఆ జట్టులోని ఓ ముగ్గురు ప్లేయర్లలో ఏ ఒక్కరు నిల్చున్నా.. మన నుంచి మ్యాచ్‌ను లాగేసుకోగలరు. ఆ ముగ్గురు ఎవరంటే.. క్వింటన్‌ డికాక్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌. ఈ మెగా టోర్నీలో సౌతాఫ్రికా ఒక్క ఓటమి కూడా లేకుండా వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచి.. ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు ఇండియా కూడా ఓటమి ఎరుగని జట్టుగానే ఫైనల్‌కు చేరింది. అయితే.. సౌతాఫ్రికా ఫైనల్‌కు రావడంలో డికాక్‌ పాత్ర చాలా కీలకం. ఎలాంటి పిచ్‌పైనైనా అగ్రెసివ్‌గా ఆడుతూ.. జట్టుకు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు.

అలాగే హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు కొద్ది సేపు క్రీజ్‌లో ఉన్నా.. చేయాల్సిన నష్టం చేసిపోతారు. అలా కాకుండా ఓ ఐదు ఆరు ఓవర్లు ఆడేస్తే మ్యాచ్‌ మన నుంచి చేజారిపోయినట్లు. పైగా సౌతాఫ్రికాకు మిల్లర్‌ మంచి ఫినిషింగ్‌లు అందిస్తున్నాడు. టీమిండియా బౌలర్ల ముందు ఉన్న ప్రధాన టార్గెట్‌ ఏంటంటే.. ఈ ముగ్గురిని వీలైనంత త్వరగా అవుట్‌ చేయాలి. ఈ ముగ్గురి కోసం ముందే పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగాలి అని క్రికెట్‌ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments