Perth Scorchers BBL 2023-24కుప్పకూలిన బ్యాటింగ్‌ లైనప్‌! కేవలం 5 పరుగులకే 7 వికెట్లు ఫట్‌!

కుప్పకూలిన బ్యాటింగ్‌ లైనప్‌! కేవలం 5 పరుగులకే 7 వికెట్లు ఫట్‌!

బిగ్ బాష్ లీగ్ 2023-24 టోర్నమెంట్‌లో భాగంగా పెర్త్ స్కార్చర్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. డెత్ ఓవర్లలో కేవలం 5 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది పెర్త్ స్కార్చర్స్.

బిగ్ బాష్ లీగ్ 2023-24 టోర్నమెంట్‌లో భాగంగా పెర్త్ స్కార్చర్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. డెత్ ఓవర్లలో కేవలం 5 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది పెర్త్ స్కార్చర్స్.

క్రికెట్ మ్యాచ్ లో ఆటగాళ్ల ప్రదర్శన అప్పుడప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. ఒక్కోసారి అరుదైన రికార్డులకు వేదికలవుతుంటాయి కొన్ని మ్యాచ్ లు. తక్కువ బంతుల్లో సెంచరీలు బాదడం, తక్కువ స్కోర్ కే జట్టును కుప్పకూల్చడం వంటి అద్భుతాలు జరుగుతుంటాయి. అచ్చం ఇలాగే ఓ లీగ్ మ్యాచ్ లో అద్భుతం చోటుచేసుకుంది. బౌలర్లు విజృంభించడంతో డెత్ ఓవరల్లో 5 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడంతో తమ ఇన్నింగ్స్‌కు దిగ్భ్రాంతికరమైన ముగింపునిచ్చింది పెర్త్ స్కార్చర్స్.

బిగ్ బాష్ లీగ్ 2023-24 టోర్నమెంట్‌లో భాగంగా పెర్త్ స్కార్చర్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌ మధ్య మ్యాచ్ జరిగింది. పెర్త్ స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడ్డాయి. కాగా ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పెర్త్ స్కార్చర్స్ 19.4 ఓవర్లలో 162 పరుగులు చేసి ఆలౌటైంది. అయితే డెత్ ఓవర్లలో పెర్త్ స్కార్చర్స్ 18 బంతుల వ్యవధిలో 157/3 నుంచి 162కి కేవలం 5 పరుగులు సాధించి ఏడు వికెట్లు కోల్పోవడం వింతైన ఘటన ఘటనగా నిలిచిపోయింది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌ బౌలర్ల ధాటికి పెర్త్ స్కార్చర్స్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయి ఆలౌట్ కావడం ఆశ్చర్యకరంగా మారింది.

57 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న పెర్త్ కెప్టెన్ ఆరోన్ హార్డీ వికెట్‌తో వికెట్ల పతనం ప్రారంభమైంది. హార్డీ ఆడమ్, జంపా బౌలింగ్ లో షాట్ ఆడగా నేరుగా సదర్లాండ్‌కి క్యాచ్ ఇచ్చాడు. రెండు బంతుల తర్వాత, నిక్ హాబ్సన్ ఔటయ్యాడు. ఆ తర్వాత సదర్లాండ్ వేసిన 18వ ఓవర్లో పెర్త్ లోయర్ ఆర్డర్‌లో మూడు వికెట్లు ఉన్నాయి. పవర్‌ఫుల్ ఫినిషర్ లారీ ఎవాన్స్ తన పుల్ షాట్‌ను మిస్ చేసి డీప్ మిడ్ వికెట్ వద్ద మెకెంజీ హార్వేకి క్యాచ్ ఇచ్చాడు. అష్టన్ అగర్ కూడా డీప్ మిడ్ వికెట్ వద్ద మరోసారి మెకెంజీ హార్వేకి క్యాచ్ ఇచ్చాడు. ఓవర్ చివరి బంతికి ఆండ్రూ టై కూడా వికెట్ చేజార్చుకున్నాడు. ఆ తర్వాత 20వ ఓవర్లో రిచర్డ్ సన్, మోరిస్ పెవిలియన్ చేరారు. కేవలం చివరి 18 బంతుల్లోనే W 1 0 W 1 0 0 1 0 0 W 1 W W W 1 0 W పెర్త్ స్కార్చర్స్ 7 వికెట్లు కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్ లో 163 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. 13 పరుగుల తేడాతో పెర్త్ స్కార్చర్స్ విజయం సాధించింది.

Show comments