MS Dhoni: వీడియో: IPL కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధోని.. ఆ డెడికేషన్​ చూస్తుంటే..!

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ ఎప్పుడు గ్రౌండ్​లోకి దిగుతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాహీ బ్యాటింగ్​ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు. వారికో గుడ్ న్యూస్. ధోని ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ ఎప్పుడు గ్రౌండ్​లోకి దిగుతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాహీ బ్యాటింగ్​ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు. వారికో గుడ్ న్యూస్. ధోని ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు.

ఈ ఏడాది క్రికెట్ ప్రేమికులకు పండుగ అనే చెప్పాలి. ఒక దాని తర్వాత ఒకటి భారీ టోర్నమెంట్లు ఉన్నాయి. మరో రెండు నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ మొదలవుతుంది. అది ముగిసిన కొన్ని వారాల గ్యాప్​ తర్వాత టీ20 వరల్డ్ కప్-2024 స్టార్ట్ అవుతుంది. ఇక ద్వైపాక్షిక సిరీస్​లు ఎలాగూ ఉండనే ఉన్నాయి. భారత క్రికెటర్లు అయితే వరుసగా మ్యాచులు ఆడుతూ ఆడియెన్స్​ను, ఫ్యాన్స్​ను ఎంటర్​టైన్ చేయనున్నారు. ఐపీఎల్, వరల్డ్ కప్​తో పాటు హోమ్ సిరీస్ మ్యాచ్​లు, ఫారెన్ టూర్లతో ఫుల్ బిజీ కానున్నారు. అయితే హోమ్ సిరీస్​లను పక్కనబెడితే అందరి ఫోకస్ క్రమంగా ఐపీఎల్ మీదకు వెళ్తోంది. ఈ టోర్నీ షురూ అయ్యేందుకు ఇంకా రెండు నెలల టైమ్ ఉంది. కానీ టీమిండియా లెజెండ్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. సన్నాహకాల్లో అతడి డెడికేషన్ మామూలుగా లేదు.

సీఎస్​కే సారథి ధోని ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. ఐపీఎల్ ప్రిపరేషన్స్​లో ఉన్న మాహీ ఏడాది గ్యాప్ తర్వాత మళ్లీ తన క్రికెట్​ కిట్​ను బయటకు తీశాడు. కాళ్లకు ప్యాడ్స్ కట్టుకొని, తలకు హెల్మెట్ ధరించి, చేతులకు గ్లవ్స్ వేసుకొని, బ్యాట్ పట్టుకొని గ్రౌండ్​లోకి దిగాడు. షాట్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు ధోని. అతడి సన్నాహకాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన చెన్నై అభిమానులు పూనకాలు లోడింగ్ అంటున్నారు. ఈసారి కూడా ఐపీఎల్​ కప్పు తమ టీమే ఎగరేసుకుపోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీజన్ స్టార్ట్ అయ్యేందుకు రెండు నెలల టైమ్ ఉన్నా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాడంటే.. ధోని డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. క్యాష్​ రిచ్ లీగ్ నుంచి రిటైర్ అయ్యే లోపు మరిన్ని ట్రోఫీలను ధోని తన అకౌంట్​లో వేసుకోవడం ఖాయమని చెబుతున్నారు.

ఇక, గతేడాది ఐపీఎల్​ టైమ్​లో ధోని కీపింగ్​తో పాటు బ్యాటింగ్​లో తీవ్రంగా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. మోకాలి గాయంతో బ్యాటింగ్ చేస్తూ పరుగులు తీయలేకపోయాడు. రన్నింగ్ ఇష్యూ వల్ల సింగిల్స్, డబుల్స్​ను పక్కనబెట్టి.. బౌండరీలు, సిక్సులు కొట్టడం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. కీపింగ్​లోనూ చాలా అన్​కంఫర్టబుల్​గా కనిపించాడు. అయితే ఎలాగోలా ఆ సీజన్ మొత్తం నెట్టుకొచ్చాడు. యువకులు, సీనియర్లతో కూడిన జట్టును అద్భుతంగా నడిపి గతేడాది టీమ్​కు మరో కప్​ను అందించాడు. ఐపీఎల్-2023 సీజన్ ముగిసిన తర్వాత కాలికి సర్జరీ చేయించుకున్న ధోని.. దాని నుంచి క్రమంగా కోలుకున్నాడు. ఇప్పుడు అతడు బ్యాటింగ్ చేస్తున్న తీరు, రెండు నెలల ముందు నుంచే ప్రిపరేషన్స్​ స్టార్ట్ చేయడాన్ని బట్టి మాహీ కంప్లీట్​గా రికవర్ అయినట్లు కనిపిస్తున్నాడు. ఒకవేళ అతడు పూర్తిగా కోలుకొని రిథమ్​లోకి వస్తే ప్రత్యర్థి బౌలర్లకు కష్టమే. మరి.. ధోని ఐపీఎల్ ప్రిపరేషన్స్​పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Team India: పెప్సీ, కోక్ కాదు.. ఇక భారత జెర్సీలపై కాంపా.. ఇది అంబానీ సాఫ్ట్ డ్రింక్!

Show comments