లక్షల్లో జివా ధోని స్కూల్‌ ఫీజ్‌.. అయినా తక్కువే అంటున్న ఫ్యాన్స్‌!

లక్షల్లో జివా ధోని స్కూల్‌ ఫీజ్‌.. అయినా తక్కువే అంటున్న ఫ్యాన్స్‌!

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని అభిమానులతో పాటు.. సామాన్యులు కూడా కోరుకుంటారు. వారి పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి ఎలాంటి చిన్న వార్త వచ్చినా.. అది నిమిషాల వ్యవధిలోనే నెట్టింట వైరల్‌గా మారుతుంది. ఇక మన దేశంలో సినీ, క్రీడాకారులకు ఉండే క్రేజ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు సాధించిన విజయాలతో పాటు.. వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి అంశం గురించి ఫ్యాన్స్‌ ఆరా తీస్తుంటారు. ఇక సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక.. అభిమానులు, సెలబ్రిటీల మధ్య దూరం తగ్గిందనే చెప్పవచ్చు. స్వయంగా సెలబ్రిటీలే వారికి సంబంధించిన అనేక అంశాలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కుమార్తె జివాకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

టీమిండి మాజీ కెప్టెన్‌ ఎం ఎస్‌ ధోని గురించి క్రికెట్‌ అభిమానులతో పాటు.. సామాన్యులకు కూడా ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారత క్రికెట్‌ జట్టు ధోని సారధ్యంలో ఎన్నో టైటిళ్లు, రివార్డులు, రికార్డులు గెలుచుకుంది. మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత ధోని సొంతం. జార్ఖండ్‌లోని ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన ధోని.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాడు. పేరు, ప్రతిష్టలతో పాటు.. డబ్బు కూడా బాగానే సంపాదించాడు. ఇటు కెరీర్‌.. అటు పర్సనల్‌ లైఫ్‌ రెండింటిని సమానంగా బ్యాలెన్స్‌ చేసుకుంటూ.. మిస్టర్‌ కూల్‌ హస్బెండ్‌, వరల్డ్స్‌ బెస్ట్‌ డాడాగా పేరు తెచ్చుకుంటున్నాడు.

సుమారు 13 ఏళ్ల క్రితం అనగా 2010, జూలై 4న ధోని, సాక్షిల వివాహం జరిగింది. వీరికి ముద్దులొలికే చిన్నారి జివా జన్మించింది. పాప పుట్టే సమయానికి అనగా.. 2015, ఫిబ్రవరి 6న జివా జన్మించగా.. అప్పుడు ధోని వన్డే వరల్డ్‌కప్‌ ఈవెంట్‌తో ఆస్ట్రేలియాలో బిజీగా ఉన్నాడు. పాప పుట్టిందనే వార్త తెలిసి.. పరుగున వచ్చి బిడ్డను చూడాలని మనను ఉవ్విళూరినా.. భారత జట్టు కెప్టెన్‌గా తన బాధ్యతలు నెరవనేర్చిన తర్వాతనే బిడ్డను చూడటానికి దేశానికి తిరిగి వచ్చాడు ధోని.

ఇక కుమార్తె అంటే ధోనికి పంచ ప్రాణాలు. ఏమాత్రం విరామం దొరికినా సరే.. బిడ్డతో గడపడానికి రెడీ అవుతాడు. ప్రస్తుతం జివా స్కూల్‌కి వెళ్తుంది. రాంచీలోనే చదువుతోంది. అయితే ధోని స్థాయికి.. తన కుమార్తెను విదేశాల్లోని అత్యున్నత పాఠశాలలో చదివించవచ్చు. కానీ కుమార్తెకు దూరంగా ఉండటం ధోనికి ఇష్టం లేదు.

డేస్కాలర్‌కే లక్షల ఫీజు

ప్రస్తుతం జివా రాంచీలోని ప్రముఖ పాఠశాలలో చదువుతోంది. ఎనిమిదేళ్ల జీవ ప్రస్తుతం మూడో తరగతి చదువుతుందని సమాచారం. ఈ ఇంటర్నేషనల్‌ స్కూల్లో డే స్కాలర్‌గా జాయిన్‌ అయిన జివా కోసం ధోని ఏడాదికి లక్షల్లో ఫీజు చెల్లిస్తున్నాడట. ఎంత అంటే ఏడాదికి రూ.2,75,000. అంటే ప్రతి నెల 23 వేల రూపాయల లెక్కన చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ పాఠశాల వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. ఇక్కడ గ్రేడ్‌ 2-8 వరకు డే స్కాలర్స్‌కి ఏటా రూ.2,75,000 ఫీజు ఉండగా.. హాస్టల్‌లో ఉండే వారికి ఏటా 4,40,000 రూపాయల ఫీజు ఉంది. అయితే ధోని సంపాదన ముందు జివా ఫీజు చాలా తక్కువే అంటున్నారు ఫ్యాన్స్‌. చాలా మంది సెలబ్రిటీలు తమ బిజీ జీవితాల్లో పిల్లల చదువు సరిగా సాగవని వారిని విదేశాల్లో, హాస్టల్స్‌లో వేస్తారు. కానీ ధోని మాత్రం.. తానే స్వయంగా దగ్గరుండి జివా ఆలనాపాలనా, తన ఎదుగుదల చూడాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం ధోని తన కుటుంబంతో కలిసి రాంచీలో ఉన్న విలాసవంతమైన ఫామ్‌ హౌజ్‌లో నివాసం ఉంటున్నాడు. ఇక ధోని కుమార్తె జివాకు కూడా సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాలో జివాకు 2.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక జివా తన తల్లి సాక్షితో కలిసి మ్యాచ్‌లకు హజరవుతూ.. తండ్రిని ఉత్సాహపరుస్తుంది. ప్రస్తుతం జివా స్కూల్‌ ఫీజ్‌ మాత్రం నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది.

Show comments