సంచలనం.. 40 పరుగులకే ఆలౌట్‌! 10 బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే..

Malaysia vs Sri Lanka, Women's Asia Cup 2024: 185 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఓ జట్టు.. కేవలం 40 పరుగులకే కుప్పకూలింది. అందులో పది మ్యాచ్‌ బ్యాటర్లు చేసిన స్కోర్‌తో ఓ మంచి ఫోన్‌ నంబర్‌ రెడీ అయింది. ఆ మ్యాచ్‌ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Malaysia vs Sri Lanka, Women's Asia Cup 2024: 185 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఓ జట్టు.. కేవలం 40 పరుగులకే కుప్పకూలింది. అందులో పది మ్యాచ్‌ బ్యాటర్లు చేసిన స్కోర్‌తో ఓ మంచి ఫోన్‌ నంబర్‌ రెడీ అయింది. ఆ మ్యాచ్‌ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

క్రికెట్‌లో కొన్ని సార్లు సంచలనాలు నమోదు అవుతుంటాయి. బ్యాటర్లు ఫోర్లు సిక్సులతో అదరగొట్టడమో.. బౌలర్లు హ్యాట్రిక్‌లతో బెదరగొట్టడమో చేస్తుంటారు. అలాగే కొన్ని జట్లు టీమ్‌లోని ఆటగాళ్లంతా వెంటవెంటనే అవుటైపోయి.. ఇన్నింగ్స్‌ కుప్పకూలుతూ ఉంటుంది. తాజాగా ఉమెన్స్‌ ఆసియా కప్‌లో అదే జరిగింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఉమెన్స్‌ ఆసియా కప్‌ 2024లో భాగంగా సోమవారం దంబుల్లాలోని రాన్‌గిరి దంబుల్లా ఇంటర్నేషనల్‌ స్టేడియంలో.. శ్రీలంక, మలేషియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మలేషియా ఉమెన్స్‌ టీమ్‌ కేవలం 40 పరుగులకే కుప్పకూలింది. ఒక్క బ్యాటర్‌ అంటే ఒక్క బ్యాటర్‌ మత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోర్‌ చేయగలిగింది. మిగతా 10 మంది బ్యాటర్లు కేవలం సింగిల్‌ డిజిట్‌కే అవుట్‌ అయ్యాడు.

ఆ పది మందిలోనూ 8 బంది కనీసం 4 పరుగులు కూడా చేయలేదు. ఏకంగా నలుగురు బ్యాటర్లు డకౌట్‌ అయ్యాడు. రెండు ఒక పరుగులు చేశారు. మరో ఇద్దరు మూడేసి రన్స్‌ కొట్టాడు. ఒకరు 7, ఇంకొకరు 9.. ఇలా వీరు చేసిన స్కోర్లన్నీ ఒక చోటు చేర్చితే.. ఒక మొబైల్‌ నంబర్‌ వస్తుందంటూ.. క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా జోకులు వేస్తున్నారు. మలేషియా బ్యాటర్లలో ఎల్సా హంటర్‌ మాత్రమే 11 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసింది. మరే బ్యాటర్‌ కూడా ఒక్క ఫోర్‌ కానీ, ఒక్క సిక్స్‌ కానీ కొట్టేలేదు. మలేషియా ఇన్నింగ్స్‌ మొత్తం మీద కేవలం రెండు ఫోర్లు మాత్రమే ఉన్నాయి.

ఇక మ్యాచ్‌ మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. శ్రీలంక కెప్టెన్‌ చమరి అటపట్టు విధ్వంసం సృష్టించింది. మలేషియా బౌలర్లను చీల్చిచెండాడుతూ.. 14 ఫోర్లు 7 సిక్సులతో హోరెత్తించింది. మొత్తంగా 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సులతో 119 పరుగులు చేసి.. శ్రీలంకకు భారీ స్కోర్‌ అందించింది. మిగతా బ్యాటర్లలో అనుష్క 31, హర్షితా 26 పరుగులతో రాణించారు. ఇక 185 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన మలేషియాను శ్రీలంక బౌలర్లు వణికించారు. వచ్చిన బ్యాటర్‌ను వచ్చినట్లే.. పెవిలియన్‌కు పంపారు. శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో.. మలేషియా కేవలం 40 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లలో శశినీ గిమ్హాని 3 వికెట్లతో రాణించింది. మరి ఈ మ్యాచ్‌లో మలేషియా 40 పరుగులకే ఆలౌట్‌ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments