KL Rahul is first player to score two centuries at Centurion Ground : సౌతాఫ్రికా గడ్డపై కొత్త చరిత్ర లిఖించిన KL.. సచిన్‌, కోహ్లీతోనే కాలేదు!

సౌతాఫ్రికా గడ్డపై కొత్త చరిత్ర లిఖించిన KL.. సచిన్‌, కోహ్లీతోనే కాలేదు!

సఫారీలతో జరుగుతున్నటెస్ట్ మ్యాచ్ లో భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీమిండియా దిగ్గజ ప్లేయర్స్ కు సాధ్యం కానీ ఘనతను సాధించి అరుదైన రికార్డును నెలకొల్పారు.

సఫారీలతో జరుగుతున్నటెస్ట్ మ్యాచ్ లో భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీమిండియా దిగ్గజ ప్లేయర్స్ కు సాధ్యం కానీ ఘనతను సాధించి అరుదైన రికార్డును నెలకొల్పారు.

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మరోసారి తన సత్తా ఏంటో చాటిచెప్పారు. తనపై విమర్శలు గుప్పించే వారికి తన ఆటతోనే సమాధానం చెప్పారు. విదేశీ గడ్డపై మరోసారి సెంచరీతో చెలరేగి భారత్ కు గౌరవప్రధమైన స్కోర్ ను అందించారు. అంతేకాదు టీమిండియా దిగ్గజాలకు కూడా సాధ్యంకాని కొత్త రికార్డును నెలకొల్పారు. సఫారీలతో సౌతాఫ్రికా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. సెంచూరియాన్ వేదికగా తొలి టెస్టు నిన్న (మంగళవారం) మొదలైంది. సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్ నెగ్గి విజయ దుందుభి మోగించేందుకు దృఢ సంకల్పంతో టీమిండియా ముందుకు సాగుతోంది. కాగా ఫస్ట్ టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఆటంకాలు ఎదురయ్యాయి.

సౌతాఫ్రకాతో జరుగుతున్న తొలి టెస్టులో సఫారీల భౌలర్ల ధాటికి టీమిండియా టాప్ ఆర్డర్ కూప్పకూలింది. 107 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. అప్పుడే భారత్ ను ఆదుకునేందుకు బరిలోకి దిగారు కేఎల్ రాహుల్. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ జట్టుకు మంచి స్కోర్ ను అందించారు. మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు దిగిన క్లాస్ బ్యాటర్ రాహుల్ అసాధారణ ఆటతో అదరగొట్టారు. 137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సుల బాది సెంచరీతో(101) అదరగొట్టాడు. ఈ సెంచరీతో కేఎల్‌ రాహుల్‌ సరికొత్త చరిత్ర సృష్టించారు.

సెంచూరియన్ గ్రౌండ్ లో కేఎల్ రాహుల్ తాజాగా సాధించిన సెంచరీతో సౌతాఫ్రికా గడ్డపై రెండు శతకాలు సాధించిన ఆటగాడిగా సరికొత్త చరిత్రను సృష్టించారు. సెంచూరియన్ లో విదేశీ ప్లేయర్ రెండు సెంచరీలు సాధించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. సఫారీ ప్లేయర్స్ తప్ప ప్రపంచంలోని ఏ క్రికెటర్ కు కూడా అది సాధ్యపడలేదు. భారత క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్లైన సచిన్, కోహ్లీలకు కూడా ఆ ఘనతను సాధించలేకపోయారు.

2021లో సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటించినప్పుడు సైతం సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో రాహుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. ఆ సమయంలో ఓపెనర్‌గా ఆడిన రాహుల్‌.. 260 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్‌తో 123 పరుగులతో అదరగొట్టాడు. తాజాగా జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో కూడా సెంచరీతో కదంతొక్కడంతో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. మరి కేఎల్ రాహుల్ సెంచూరియన్ గ్రౌండ్ లో రెండు సెంచరీలు నమోదు చేసి అరుదైన రికార్డును నెలకొల్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments