SNP
కేశవ్ మహరాజ్.. సౌతాఫ్రికా-పాకిస్థాన్ మ్యాచ్‌లో హీరో. అతను చేసింది కేవలం 7 పరుగులకే కానీ, సౌతాఫ్రికాపై ఛోకర్స్ అనే ముద్రను తొలగించేందుకు ఆ 7 పరుగులే ఉపయోగపడ్డాయి. అయితే.. కేశవ్ చేసిన అద్భుతంగా వెనుక మరో శక్తి కూడా ఉంది. అదేంటో చూద్దాం..
కేశవ్ మహరాజ్.. సౌతాఫ్రికా-పాకిస్థాన్ మ్యాచ్‌లో హీరో. అతను చేసింది కేవలం 7 పరుగులకే కానీ, సౌతాఫ్రికాపై ఛోకర్స్ అనే ముద్రను తొలగించేందుకు ఆ 7 పరుగులే ఉపయోగపడ్డాయి. అయితే.. కేశవ్ చేసిన అద్భుతంగా వెనుక మరో శక్తి కూడా ఉంది. అదేంటో చూద్దాం..
SNP
వన్డే వరల్డ్ కప్ 2023లో తొలిసారి ఓ మ్యాచ్ దాదాపు చివరి వరకు వెళ్లి, నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసింది. శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పాకిస్థాన్-సౌతాఫ్రికా మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠపోరులో చివరి సౌతాఫ్రికా గెలిచింది. నిజానికి ఈ మ్యాచ్‌ను ఒక దశలో సౌతాఫ్రికా చాలా సులువుగా గెలవాల్సి ఉంది. కానీ, వారికున్న ఛోకర్స్ అనే ట్యాగ్‌లైన్‌ను కాస్త న్యాయం చేస్తూ.. చివర్లో ఒత్తిడికి లోనై దాదాపు ఓటమి అంచులకు వెళ్లి మ్యాచ్‌ను గెలిచారు. పాపం.. డూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలుపు అంచులకు వెళ్లి ఓటమి పాలైంది. మొత్తానికి ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మాత్రం ఫుల్ వినోదాన్ని అందించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు విజయాన్ని అందించింది మాత్రం కేశవ్ మహరాజ్.
ఈ సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్.. బ్యాటింగ్‌లో చేసింది 7 పరుగులు మాత్రమే, కొట్టింది ఒకే ఒక బౌండరీ అయినా కూడా అవెంతో విలువైన పరుగులు. 21 బంతుల్లో ఒక బౌండరీ సాయంతో కేశవ్ 7 పరుగులు చేశాడు. కానీ, అతనే సౌతాఫ్రికాకు హీరో అయ్యాడు. ఎందుకంటే.. చివరల్లో సౌతాఫ్రికా చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉన్న సమయంలో పాకిస్థాన్ పేసర్లు నిప్పులు చిమ్ముతున్న క్రమంలో వికెట్ కాపాడుకుంటూ.. సింగిల్స్ తీస్తూ.. ఒక్కో బాల్‌ను ఆడేందుకు గుండెలు అదురుతున్న తరుణంలో.. ఎంతో అద్భుతంగా ఆడటమే కాకుండా.. చివర్లో 4 పరుగులు అవసమరమైన సమయంలో ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు. చాలా కాలం తర్వాత ఇలాంటి పరిస్థితిల్లో సౌతాఫ్రికా గెలిచింది. నిజానికి వాళ్లపై ఛోకర్స్ అనే ముద్ర ఉంది. మెగా టోర్నీల్లో ఎంత అద్భుతంగా ఆడినా.. ఒత్తిడిని తట్టుకోలేక గెలవాల్సిన మ్యాచ్‌లో కూడా ఓటమి పాలవుతుంటారనే విమర్శ ఉంది.
శుక్రవారం పాకిస్థాన్‌పై కూడా సౌతాఫ్రికా చాలా ఈజీగా గెలవాల్సింది. 36 ఓవర్లకు 235 పరుగులు చేసి 5 వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్టస్థితిలో ఉంది. 14 ఓవర్లలో కేవలం 36 పరుగులు మాత్రమే చేయాలి. అప్పటికే మార్కరమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మంచి ఊపు మీదున్నాడు. కానీ, ఇక్కడి నుంచి సౌతాఫ్రికా ఒత్తిడికి గురైంది. వరుసగా వికెట్లు కోల్పోయింది. 235 పరుగుల వద్ద 6వ వికెట్, 250కి 7వ వికెట్, 250కి 8వ వికెట్, 260కి 9వ వికెట్ కోల్పోయింది. ఈ దశలో విజయానికి 11 రన్స్ కావాలి కానీ, చేతిలో ఒక్క వికెటే ఉంది. పాకిస్థాన్ వద్ద మరో పేస్ బౌలింగ్ ఆప్షన్ ఉంటే ఫలితం వేరేలా ఉండేది కానీ, షాహీన్ అఫ్రిదీ, రౌఫ్, వసీమ్ జూనియర్ల కోటా పూర్తి అవ్వడంతో స్పిన్నర్‌తోనే వేయించాల్సిన పరిస్థితి.
ఈ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్న కేశవ్ మహరాజ్… ఇన్నింగ్స్ 48వ ఓవర్ రెండు బంతికి బౌండరీ బాది సౌతాఫ్రికాను గెలిపించాడు. అయితే.. కేశవ్ మహరాజ్ భారతీయ మూలాలు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని తెలిసిందే. పైగా కేశవ్ శివుడికి పెద్ద భక్తుడు. అతని బ్యాట్‌పై కూడా ఓం అనే సింబల్ ఉంటుంది. కాగా, ఈ మ్యాచ్ విజయాన్ని కేశవ్ హనుమంతుడికి అంకితం ఇవ్వడం విశేషం. మరి కేశవ్ మహరాజ్ ఒత్తిడిలో అద్భుతంగా ఆడి పాకిస్థాన్‌ను ఓడించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Instagram post by Keshav Maharaj.
– He thanked the God “Jai Shree Hanuman”. pic.twitter.com/dld3XT3iQ8
— Johns. (@CricCrazyJohns) October 27, 2023