Sandeep Lamichhane: అత్యాచారం కేసు.. స్టార్ క్రికెటర్ కు 8 ఏళ్ల జైలు శిక్ష!

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఓ స్టార్ క్రికెటర్ కు 8 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు.

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఓ స్టార్ క్రికెటర్ కు 8 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు.

సాధారణంగా క్రికెటర్లకు జైలు శిక్షలు పడటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. డోపింగ్ టెస్టులు, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి కేసుల్లో మాత్రమే వారిపై నిషేధంతో పాటుగా సంఘటన తీవ్రతను బట్టి సదరు ప్లేయర్లకు శిక్షలు పడతాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ స్టార్ క్రికెటర్ కు 8 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నేపాల్ జట్టు కెప్టెన్ సందీప్ లామిచానే దోషిగా తేలాడు. దీంతో కాట్మాండ్ డిస్ట్రిక్ కోర్ట్ అతడికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

2022 ఆగస్టులో కాట్మాండ్ లోని ఓ హోటల్ లో సందీప్ లామిచానే తనపై అత్యాచారం చేశాడని ఓ మైనర్ బాలిక కోర్టును ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడి పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత అతడు బెయిల్ పై విడుదల అయ్యాడు. ఈ క్రమంలనే తాజాగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తన తీర్పును వెలువరించింది. తీర్పులో భాగంగా సందీప్ కు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఈ విషయం క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉండగా.. లెగ్ స్పిన్నర్ గా తన కెరీర్ ప్రారంభించిన లామిచానే, తక్కువ కాలంలోనే స్టార్ క్రికెటర్ గా ఎదగడమే కాకుండా.. సారథ్య పగ్గాలు కూడా చేపట్టాడు. అలాంటి సందీప్ పై అత్యాచార ఆరోపణలు రాగానే నేపాల్ క్రికెట్ అసోసియేషన్ సస్పెన్షన్ విధించింది. ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే.. నేపాల్ తరఫున 51 వన్డేలు ఆడి 112 వికెట్లు, 52 టీ20ల్లో 98 వికెట్లు పడగొట్టాడు. అదీకాక ఐపీఎల్ ఆడిన తొలి నేపాలీ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు లామిచానే. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తరఫున 2018, 19 సీజన్స్ లో ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. మరి ఓ స్టార్ క్రికెటర్ కు జైలు శిక్ష పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments