బీసీసీఐ తప్పేం లేదు.. ఇషాన్, అయ్యర్​ను తీసేయడమే కరెక్ట్: మాజీ క్రికెటర్

ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్​పై బీసీసీఐ వేటు వేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఓ మాజీ క్రికెటర్ రియాక్ట్ అయ్యాడు. వాళ్లిద్దర్నీ తీసేయడమే కరెక్ట్ అన్నాడు.

ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్​పై బీసీసీఐ వేటు వేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఓ మాజీ క్రికెటర్ రియాక్ట్ అయ్యాడు. వాళ్లిద్దర్నీ తీసేయడమే కరెక్ట్ అన్నాడు.

టీమిండియా ఫ్యూచర్ స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్. అయ్యర్ నిలకడగా పరుగులు చేస్తూ ప్రామిసింగ్ బ్యాటర్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇషాన్ లెఫ్టాండ్​ బ్యాటింగ్​తో అదరగొడుతూనే టాలెంటెడ్ కీపర్​గానూ అందరి దృష్టిని ఆకర్షించాడు. వీళ్లిద్దరూ టీమ్​లో చాలా ఏళ్లు కొనసాగుతారని అనుకుంటున్న వేళ స్వీయ తప్పిదాలతో భారత క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్​ను కోల్పోయారు. డొమెస్టిక్ క్రికెట్​లో ఆడాలని బీసీసీఐ ఆదేశించినా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. బోర్డు వేటు వేయడంతో వీరి కెరీర్ ప్రమాదంలో పడింది. ఇప్పట్లో టీమిండియాలోకి వీళ్లు కమ్​బ్యాక్ ఇవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ విషయంపై భారత మాజీ కోచ్, 1983 వరల్డ్ కప్ హీరో మదన్ లాల్ రియాక్ట్ అయ్యాడు. బీసీసీఐ చేసిన దాంట్లో తప్పేమీ లేదన్నాడు. వాళ్లిద్దర్నీ తీసేయడమే కరెక్ట్ అన్నాడు.

ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్​ల కాంట్రాక్ట్​లను బోర్డు తొలగించడమే కరెక్ట్ అన్నాడు మదన్​లాల్. గేమ్ కంటే ఎవరూ ఎక్కువ కాదని స్పష్టం చేశాడు. ‘ఇషాన్, అయ్యర్​ ఫస్ట్​క్లాస్ క్రికెట్ ఆడాల్సిందేనని బోర్డు ఆదేశిస్తే వాళ్లు తప్పక ఆడాలి. ఆట కంటే ఎవరూ ఎక్కువ కాదు. ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో టీమిండియా ఆటగాళ్లు ఆడాల్సిందేనంటూ బోర్డు రూల్ తీసుకురావడం గొప్ప విషయం. ఇందుకు బీసీసీఐని మెచ్చుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది ప్లేయర్లు డొమెస్టిక్ క్రికెట్​ను లైట్ తీసుకుంటున్నారు. ఐపీఎల్ వల్ల ఈ దుస్థితి నెలకొంది. బీసీసీఐ పెట్టిన నిబంధనలను ఆటగాళ్లు తప్పకుండా ఫాలో అవ్వాలి. ఒకవేళ రూల్స్​ను ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకొని అందరికీ హెచ్చరికలు పంపాలి’ అని మదన్ లాల్ చెప్పుకొచ్చాడు. వాళ్లకో రూల్.. వీళ్లకో రూల్ అంటూ ఉండదని.. బోర్డు ఓ నిబంధన పెట్టిందంటే దానికి అందరూ కట్టుబడాల్సిందేనని స్పష్టం చేశాడు.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్​ను కోల్పోయినా భారత జట్టులోకి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వొచ్చని అన్నాడు మదన్​లాల్. ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో రాణించడం ద్వారా ఫామ్, ఫిట్​నెస్​ను నిరూపించుకోవాలని వాళ్లిద్దరికీ సూచించాడు. ఫస్ట్​క్లాస్ క్రికెట్​తో పాటు ఐపీఎల్​లో పెర్ఫార్మెన్స్​తో అదరగొట్టడం ద్వారా కూడా కమ్​బ్యాక్ ఇవ్వొచ్చన్నాడు. ఇషాన్, అయ్యర్​ భారత జట్టుకు ఎంతో సేవలు అందించారని.. తమకు వచ్చిన ఛాన్సుల్ని యూజ్ చేసుకొని బాగా పెర్ఫార్మ్ చేశారని మెచ్చుకున్నాడు. అయితే టీమ్ బాగు కోసం పెట్టే రూల్స్​ను ఎవరు అతిక్రమించినా బీసీసీఐ ఊరుకోదని.. క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదన్నాడు మదన్​లాల్. ఫెంటాస్టిక్ రిజల్ట్స్ రావాలంటే డిసిప్లిన్ కూడా అదే లెవల్లో ఉంటేనే సాధ్యమన్నాడీ వరల్డ్ కప్ హీరో. మరి.. అయ్యర్, ఇషాన్​ను తీసేయడమే కరెక్ట్ అంటూ మదన్​లాల్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ అంతా ఫిక్సింగేనా? ఇదే సాక్ష్యం!

Show comments