పాండ్యా కెప్టెన్సీలో ఆడటం రోహిత్​కు ఇష్టం లేదా? పోస్ట్ డిలీట్ దేనికి?

ఐపీఎల్-2024 మొదలవడానికి ముందే ముంబై ఇండియన్స్ జట్టులో ప్రకంపనలు రేగుతున్నాయి. నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ సారథి రోహిత్ శర్మ మధ్య జరుగుతున్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఐపీఎల్-2024 మొదలవడానికి ముందే ముంబై ఇండియన్స్ జట్టులో ప్రకంపనలు రేగుతున్నాయి. నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ సారథి రోహిత్ శర్మ మధ్య జరుగుతున్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్​కు అంతా రెడీ అవుతోంది. మరో వారం రోజుల్లో క్యాష్​ రిచ్ లీగ్​కు తెరలేవనుంది. దీంతో ఫ్రాంచైజీలన్నీ ఆటగాళ్లను ఒక్క చోట చేర్చి ముమ్మరంగా ప్రాక్టీస్ చేయిస్తున్నాయి. ఈసారి అస్సలు కప్ మిస్ కావొద్దని అనుకుంటున్నాయి. అందుకోసం తీవ్రంగా సాధన చేయడంతో పాటు స్ట్రాటజీ ప్లానింగ్​లో మునిగిపోయాయి. ఏ జట్టును ఎలా ఓడించాలి? తమ ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు ఏంటనేది చూసుకుంటున్నాయి. ఐపీఎల్ వచ్చేస్తోందంటూ భారీ ఎత్తున ప్రచారం జరుగుతుండటం.. హోర్డింగులు, యాడ్స్​తో హోరెత్తిస్తుండటంతో అన్ని సిటీల్లోనూ సందడి స్టార్ట్ అయిపోయింది. ఈ తరుణంలో ముంబై ఇండియన్స్ జట్టులో ప్రకంపనలు రేగుతున్నాయి. ఆ టీమ్​లో కెప్టెన్సీ మార్పు అంశం ఇంకా సెటిల్ కాలేదని అనిపిస్తోంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ పోస్ట్ పెట్టి డిలీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ముంబై సీనియర్ బ్యాటర్ రోహిత్ గురువారం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ‘అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్. మీ అందరితో ఓ విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నా. ఈ ఏడాది ఐపీఎల్​లో నేను ఆడటం లేదు. గత ఏడాది కాలంగా రెస్ట్ లేకుండా క్రికెట్ ఆడటంతో అలసిపోయా. దీంతో కొన్నాళ్లు బ్రేక్ తీసుకోవాలని భావించా. జూన్​లో మొదలయ్యే టీ20 వరల్డ్ కప్​లో భారత జట్టు తరఫున అదరగొట్టేందుకు నేను రెడీగా ఉన్నా. జై హింద్’ అంటూ రోహిత్ ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో అందరూ హిట్​మ్యాన్ ఈ సీజన్​లో ముంబైకి ఆడట్లేదని ఫిక్స్ అయ్యారు. అయితే కొన్ని క్షణాల్లోనే ఈ పోస్టును అతడు డిలీట్ చేశాడు. దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ తలలు పట్టుకున్నారు.

ఈ సీజన్​లో ఆడనంటూ పోస్ట్ పెట్టి రోహిత్ డిలీట్ చేయడంతో అతడు బరిలోకి దిగేది, లేనిది క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఇది చూసిన వాళ్లు మాత్రం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడటం ఇష్టం లేకే హిట్​మ్యాన్ ఇలా చేశాడని అంటున్నారు. అయితే పాండ్యా సారథ్యంలో ఆడాలని లేకా? లేదా ఇంకేదైనా ఒత్తిడి వల్ల రోహిత్ ఇలా చేసి ఉండొచ్చనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా మినీ ఆక్షన్ టైమ్​లో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ ముంబైకి రావడం, వెంటనే అతడికి ముంబై యాజమాన్యం సారథ్య బాధ్యతలు అప్పజెప్పిన దగ్గర నుంచి ఇద్దరి మధ్య కోల్డ్​వార్ నడుస్తోంది. దీనిపై రోహిత్ బయట ఎక్కడా రియాక్ట్ కాకపోయినా.. అతడికి హార్దిక్​కు పొసగట్లేదని టాక్ నడుస్తోంది. ముంబై యాజమాన్యంతోనూ హిట్​మ్యాన్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నాడని క్రికెట్ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024లో హిట్​మ్యాన్ ఆడతాడో లేదో క్వశ్చన్ మార్క్​గా మిగిలిపోయింది. మరి.. ఈ సీజన్​లో రోహిత్ బరిలోకి దిగుతాడని మీరు అనుకుంటే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ఆ విషయాల్లో ధోని, విరాట్ కోహ్లీలు ఒక్కటే.. ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Show comments