ఇంకో అస్త్రం బయటకు తీస్తున్న హార్దిక్.. వేరే ఆప్షన్ లేకపోవడంతో..!

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంకో అస్త్రం బయటకు తీయాలని ఫిక్స్ అయ్యాడు. ఇది వర్కౌట్ అయితే ముంబైకి ఎదురుండదు.

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంకో అస్త్రం బయటకు తీయాలని ఫిక్స్ అయ్యాడు. ఇది వర్కౌట్ అయితే ముంబైకి ఎదురుండదు.

ఐపీఎల్-2024 కోసం ముంబై ఇండియన్స్ రెడీ అవుతోంది. ఆ జట్టు 24వ తేదీన గుజరాత్ టైటాన్స్​తో తమ తొలి మ్యాచ్​ ఆడనుంది. అయితే మిగతా అన్ని జట్లతో పోల్చుకుంటే ముంబైకి ఈ సీజన్ ఎంతో కీలకం కానుంది. గుజరాత్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను మినీ వేలంలో చేజిక్కించుకున్న ముంబై.. అతడికే జట్టు కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. ఐదు సార్లు టీమ్​ను ఛాంపియన్​గా నిలిపిన రోహిత్ శర్మను కాదని పాండ్యాను సారథిగా నియమించడం మీద అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. ఇప్పటికి అవి చల్లారినా.. టీమ్​లో మాత్రం చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. సీజన్​కు మరో నాల్రోజుల టైమ్ కూడా లేదు. ఇప్పటికే ఇద్దరు ప్లేయర్లు ఆడటం అనుమానంగా మారింది. దీంతో టఫ్ సిచ్యువేషన్​ ఫేస్ చేస్తున్న ముంబై కోసం హార్దిక్ ఇంకో అస్త్రాన్ని బయటకు తీస్తున్నాడు.

నయా సీజన్ స్టార్ట్ కాకముందే ముంబైకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ మధుశంక తొడకండరాల సమస్యతో ఫస్ట్ ఫేజ్ మ్యాచులకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్​తో జరిగిన రెండో వన్డేలో అతడు గాయపడ్డాడు. కొన్ని రోజల పాటు శ్రీలంకలోనే ఉండి ట్రీట్​మెంట్ తీసుకోనున్నాడతను. ఐపీఎల్​లో ఎప్పుడు కమ్​బ్యాక్ ఇస్తాడో క్లారిటీ లేదు. గతేడాది ఆఖర్లో నిర్వహించిన మినీ వేలంలో రూ.4.60 కోట్లు పెట్టి అతడ్ని సొంతం చేసుకుంది ముంబై. అయితే ఏం లాభం సీజన్ ఆరంభానికి ముందే దూరమయ్యాడు. మరో స్టార్ పేసర్ కొయెట్జీ ఆడటం కూడా డౌట్ అంటున్నారు. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న ఈ సౌతాఫ్రికా స్పీడ్​స్టర్.. ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై సారథి పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరు పేసర్లు దూరం కానుండటంతో స్వయంగా తానే బౌలింగ్​కు దిగాలని ఫిక్స్ అయ్యాడు.

ఈ సీజన్​లో తాను బౌలింగ్ చేయనున్నానని హార్దిక్ తెలిపాడు. మీడియా ఇంటరాక్షన్​లో పాల్గొన్న పాండ్యా.. రోహిత్ మీద కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా సారథి అయిన రోహిత్ శర్మ జట్టులో ఉండటం తనకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నాడు. ముంబై ఇన్ని ట్రోఫీలు నెగ్గిందంటే, ఈ స్థాయికి చేరుకుందంటే అంతా హిట్​మ్యాన్ కెప్టెన్సీ వల్లేనని స్పష్టం చేశాడు పాండ్యా. తన కెరీర్ మొత్తం రోహిత్ కెప్టెన్సీలోనే ఆడానని.. అతడి చేతులు ఎప్పుడూ తన భుజాల మీద ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక, గాయం కారణంగా వన్డే వరల్డ్ కప్ తర్వాత నుంచి టీమ్​కు దూరంగా ఉంటున్నాడీ స్టార్ ఆల్​రౌండర్. ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యాడు కాబట్టి ఐపీఎల్​లో అతడు బౌలింగ్​కు దిగకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ కీలక బౌలర్లు గాయాలబారిన పడటంతో వేరే గత్యంతరం లేక బాల్ చేత పట్టాలని పాండ్యా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ హార్దిక్ బౌలర్​గా సక్సెస్ అయితే మాత్రం టీమ్​కు తిరుగుండదనే చెప్పాలి. మరి.. హార్దిక్ బౌలింగ్ అస్త్రం సక్సెస్ అవుతుందని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments