Nidhan
ఐపీఎల్-2024లో మ్యాజిక్ చేయాలని చూస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి కప్పు ఎగరేసుకుపోవాలని భావిస్తోంది. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని డీసీ.. ఈసారి సత్తా చాటాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో పంత్ సేన బలం, బలహీనతలు, విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్-2024లో మ్యాజిక్ చేయాలని చూస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి కప్పు ఎగరేసుకుపోవాలని భావిస్తోంది. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని డీసీ.. ఈసారి సత్తా చాటాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో పంత్ సేన బలం, బలహీనతలు, విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Nidhan
ఐపీఎల్ హిస్టరీలో ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గని జట్లలో ఢిల్లీ కూడా ఒకటి. చాలా మంది సూపర్స్టార్లు ఈ టీమ్‌కు ఆడినా కప్పు కలను మాత్రం నెరవేర్చలేకపోయారు. ఫ్యాన్ బేస్‌లో కూడా సీఎస్కే, ఆర్సీబీ, ఎంఐ లాంటి జట్లతో పోల్చుకుంటే ఢిల్లీ కాస్త వెనుకంజలోనే ఉంది. అయితే టీమిండియా తరఫున సూపర్బ్‌గా ఆడుతూ ఫ్యూచర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రిషబ్ పంత్ ఆడుతుండటంతో క్యాపిటల్స్ మ్యాచులపై అందరి ఫోకస్ నెలకొంది. పంత్‌తో పాటు పలువురు భారత సీనియర్ టీమ్ ఆటగాళ్లు ఇందులో ఉండటంతో మంచి క్రేజ్ నెలకొంది. గాయం కారణంగా దూరమైన పంత్.. రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుండటంతో ఢిల్లీ టీమ్ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ జట్టు బలం, బలహీనతలు, విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఢిల్లీ క్యాపిటల్స్ అతిపెద్ద బలం రిషబ్ పంత్. రీఎంట్రీ ఇస్తున్న అతడు.. ఫుల్ ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో అతడు భారీ షాట్లు బాదుతూ ఓల్డ్ పంత్‌ను గుర్తుకు తెస్తున్నాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా టీమ్‌కు అతడే కొండంత బలం. ఒకవేళ పంత్ మంచి ఫామ్‌లో ఉంటే మాత్రం డీసీకి టోర్నీలో ముందుకు వెళ్లే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. రిషబ్‌తో పాటు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, హ్యారీ బ్రూక్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో క్యాపిటల్స్ బ్యాటింగ్ యూనిట్ సూపర్ స్ట్రాంగ్‌గా ఉంది. నోర్జే, ముకేశ్ కుమార్, మార్ష్ లాంటి క్వాలిటీ పేసర్లతో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లాంటి హైక్లాస్ స్పిన్నర్లతో ఢిల్లీ బౌలింగ్ దళం కూడా బలంగా ఉంది. ఆల్‌రౌండర్స్ అయిన అక్షర్, మార్ష్‌లు అంచనాలకు తగ్గట్లు రాణిస్తే డీసీకి తిరుగుండదు.
ఆల్‌రౌండర్ల కొరత డీసీని ఇబ్బంది పెడుతోంది. మార్ష్, అక్షర్ రూపంలో మంచి ఆల్‌రౌండర్లు ఉన్నా.. వాళ్లు ఫెయిలైతే బ్యాకప్ ఆప్షన్స్ లేవు. మార్ష్, అక్షర్ మీద అతిగా ఆధారపడటం ఆ ఇద్దరి మీద అదనపు ఒత్తిడిని పెంచుతోంది. బ్యాటింగ్‌లో అంతా బాగానే ఉన్నా.. పృథ్వీ షా ఒక్కడితో సమస్య అనే చెప్పాలి. గత సీజన్లలో అతడు తన స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు. బౌలింగ్‌లో నోర్జే రూపంలో లీథల్ పేసర్ ఉన్నాడు. కానీ గాయాలతో సావాసం చేస్తున్న ఈ సౌతాఫ్రికా ఆటగాడు.. ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. అతడికి గాయం తిరగబెడితే పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. పంత్ కూడా ఘోరమైన ప్రమాదం నుంచి కోలుకొని కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు. అతడి ఫిట్నెస్ మీద కూడా ఓ కన్నేసి ఉంచాలి.
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఒక్కసారి మాత్రం టోర్నీ ఫైనల్స్‌కు చేరుకుంది. 2020లో తుది సమరానికి అర్హత సాధించిన డీసీ.. ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. గత రెండేళ్లు లీగ్ స్టేజ్‌కు పరిమితమైంది.
డీసీ బలం, బలహీనతలు, గత రికార్డులు, ప్రస్తుత టీమ్ కాంబినేషన్, ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్ లాంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆ టీమ్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమే. ఒకవేళ పంత్, వార్నర్, మార్ష్‌తో పాటు కుల్దీప్, నోర్జే లాంటి ఆటగాళ్లు అద్భుతంగా ఆడితే ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి.