Nidhan
India vs Sri Lanka: భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మొదలైపోయింది. టాస్ నెగ్గిన ఆతిథ్య జట్టు ఫస్ట్ బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ టాస్ టైమ్‌లో రోహిత్ శర్మకు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది.
India vs Sri Lanka: భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మొదలైపోయింది. టాస్ నెగ్గిన ఆతిథ్య జట్టు ఫస్ట్ బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ టాస్ టైమ్‌లో రోహిత్ శర్మకు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది.
Nidhan
భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మొదలైపోయింది. టాస్ నెగ్గిన ఆతిథ్య జట్టు ఫస్ట్ బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్‌కు చోటు దక్కలేదు. అతడికి బదులు సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌ను టీమ్‌లోకి తీసుకుంది టీమిండియా. అతడే కీపింగ్ బాధ్యతలు చూసుకోనున్నాడు. పంత్ తప్ప.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మిగతా అన్ని ప్లేసెస్‌లో అనుకున్న ప్లేయర్లనే తీసుకున్నారు. ఇక, ఈ మ్యాచ్ టాస్ టైమ్‌లో రోహిత్ శర్మకు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. ‘నువ్వు కూడా బౌలింగ్ చేస్తావా?’ అని కామెంటేటర్ హిట్‌మ్యాన్‌ను అడిగారు. దీనికి అతడు దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇచ్చాడు.
ఇక మీదట తన ఫోకస్ కేవలం బ్యాటింగ్ మీదే ఉంటుందన్నాడు రోహిత్. ఎప్పటిలాగే బ్యాటింగ్, సారథ్యం.. ఈ రెండింటి పైనే దృష్టి సారిస్తానన్నాడు. జట్టులో చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయని.. కాబట్టి తాను చేయి తిప్పాల్సిన అవసరం లేదన్నాడు హిట్‌మ్యాన్. కాగా, కొత్త కోచ్ గంభీర్ రాకతో బ్యాటర్లు బౌలర్లుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఆరో బౌలర్ ప్లేస్‌ను భర్తీ చేసేందుకు రియాన్ పరాగ్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ లాంటి బ్యాటర్లతో బౌలింగ్ చేయించి గౌతీ ఫలితం రాబట్టాడు. వీళ్లందరూ లంకతో టీ20 సిరీస్‌లో బ్యాట్‌తో పాటు బాల్‌తోనూ సక్సెస్ అయ్యారు. వన్డే సిరీస్‌కు ముందు శ్రేయస్ అయ్యర్‌తో నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేయించాడు గంభీర్. ఈ నేపథ్యంలోనే ‘నువ్వు కూడా బౌలింగ్ చేస్తావా?’ అంటూ రోహిత్‌కు ప్రశ్న ఎదురైంది.
Rohit Sharma said, “I will focus on my batting. We have enough bowlers in the squad that can roll their arm over (laughs)”. pic.twitter.com/XXsrYNEL18
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2024