భారత్ ఆతిథ్యం ఇస్తున్న వన్డే వరల్డ్ కప్-2023 రసవత్తరంగా సాగుతోంది. భారీ స్కోర్లు, ఛేజింగ్‌లతో ప్రేక్షకులకు ఫుల్ మజాను పంచుతోంది. ఇప్పటికే అన్ని జట్లు ఒకట్రెండు మ్యాచ్‌లు ఆడేశాయి. ఇంకా మెగా టోర్నీలో చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మొదట్లో మ్యాచులకు ఆడియెన్స్ నుంచి ఆదరణ తక్కువగా కనిపించింది. కానీ క్రమంగా మ్యాచులకు భారీగా తరలి వస్తున్నారు ప్రేక్షకులు. మ్యాచ్‌లు పోటాపోటీగా సాగుతుండటటంతో చూసేందుకు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. ఈ తరుణంలో వరల్డ్ కప్‌పై హైప్‌ను మరింత పెంచే ఒక మ్యాచ్‌కు అంతా సిద్ధమవుతోంది. అదే భారత్-పాకిస్థాన్ మ్యాచ్.
ఇండియా-పాకిస్థాన్‌ల మధ్య సాధారణంగా ఎప్పుడు మ్యాచ్ జరిగినా చూసేందుకు ప్రేక్షకులు తెగ ఉత్సాహం చూపిస్తారు. ఈ మ్యాచ్ టికెట్ల కోసం రూ.వేలు, రూ.లక్షలు ఖర్చు చేసేందుకూ రెడీ అయిపోతారు. అలాంటిది వరల్డ్ కప్‌లో ఇరు జట్లు పోటీపడుతున్నాయంటే ఇంకా హంగామా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 15న ఇండో-పాక్ నడుమ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం దీనికి వేదిక కానుంది. ఈ మ్యాచ్ కోసం టికెట్లన్నీ ఎప్పుడో బుక్ అయిపోయాయి. మ్యాచ్ నాడు స్టేడియం కిక్కిరిసిపోవడం ఖాయం. మిగిలిన ఫ్యాన్స్ అంతా టీవీలు, ఫోన్లకు అతుక్కుపోవడం పక్కా అనే చెప్పాలి.
ఎంతో హైప్ ఉన్న భారత్-పాక్ మ్యాచ్ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ టైమ్‌కు మూవీ సెలబ్రిటీస్‌తో స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సెలబ్రిటీల ఆటపాటలతో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపాలని ప్లాన్ చేస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులు ఎంజాయ్ చేయడం ఖాయం. కానీ బీసీసీఐ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్స్, ఇతర టీమ్స్ ఫ్యాన్స్ మాత్రం సీరియస్ అవుతున్నారు. ఇండో-పాక్ మ్యాచ్ నుంచి మరింత డబ్బులు రాబట్టుకోవడానికే ఇలా చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.
ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐ వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించలేదని.. కానీ ఇండియా-పాక్ మ్యాచ్‌కు మాత్రం గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తుండటం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. భారత్-పాక్ టీమ్స్‌ను ఒకలా చూడటం.. మిగిలిన జట్లను వేరేలా చూడటం ఎంతవరకు కరెక్ట్ అని ఇతర టీమ్స్ ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్‌కు గనుక స్పెషల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నారంటే ఇతర టీమ్స్ కెప్టెన్స్‌ను అవమానించడమేనని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ కాంట్రవర్సీపై బీసీసీఐ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరి.. బీసీసీఐ స్పెషల్ ప్రోగ్రామ్స్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: గిల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్.. ఆయన ఏమన్నాడంటే..!
There was no opening ceremony for 2023 World Cup.
India Vs Pakistan will have special programs with celebrities performing. pic.twitter.com/3FCtJlmnrS
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2023