WCL 2024: ఫైనల్‌లో తలపడనున్న ఇండియా, పాకిస్థాన్‌! కప్పు ఎవరిదంటే..?

IND vs PAK, Final, WCL 2024: మాజీ క్రికెటర్లు ఆడుతున్న వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ 2024 లీగ్‌ ఫైనల్‌లో ఇండియా, పాకిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs PAK, Final, WCL 2024: మాజీ క్రికెటర్లు ఆడుతున్న వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ 2024 లీగ్‌ ఫైనల్‌లో ఇండియా, పాకిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచ క్రికెట్‌ లోకం మొత్తం ఎంతో ఆసక్తిగా చూసే మ్యాచ్‌ ఏదైన ఉందంటే.. అది కచ్చితంగా ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ మాత్రమే. అది లీగ్‌ మ్యాచ్‌ అయినా సరే.. చివరికి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అయినా సరే.. క్రికెట్‌ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారు. ఇక ఒక మెగా టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ అంటే మామూలుగా ఉంటుందా? అలాంటి హైఓల్టేజ్‌ మ్యాచ్‌ శనివారం జరగనుంది. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ 2024లో భాగంగా.. ఇండియా ఛాంపియన్స్‌, పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఈ రోజు రాత్రి 9.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

తమ అభిమాన క్రికెటర్ల ఆటను మిస్‌ అవుతున్నాం అని బాధపడుతున్న వారికి వినోదంతో పాటు.. ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ఉండే మజా కూడా ఈ వరల్డ్‌ ఛాంపియన​్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ టోర్నీతో లభిస్తోంది. ఇండియా ఛాంపియన్స్‌ నుంచి యువరాజ్‌ సింగ్‌, ఊతప్ప, యూసుఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ దుమ్మురేపుతున్నారు. వీరితో పాటు సురేష్‌ రైనా, అంబటి రాయుడు, హర్భజన్‌ సింగ్‌ కూడా ఆకట్టుకుంటున్నారు. మరోవైపు పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ టీమ్‌లో ఒకప్పటి స్టార్‌ క్రికెటర్లు యూనిస్‌ ఖాన్‌, కమ్రాన్‌ అక్మల్‌, షోయబ్‌ మాలిక్‌, షాహిద్‌ అఫ్రిదీ, మిస్బా ఉల్‌ హక్‌, అబ్దుల్‌ రజాక్‌, వాహబ్‌ రియాజ్‌, మొహమ్మద్‌ హఫీజ్‌ లాంటి వాళ్లు ఆడుతున్నారు.

ఇలా ఇరు దేశాల నుంచి మాజీ క్రికెటర్లు.. తమ ప్రైమ్‌టైమ్‌లో ఆడినట్లు ఆడుతూ.. క్రికెట్‌ అభిమానులకు అద్భుతమైన వినోదం అందిస్తున్నారు. ఈ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌లో భాగంగా జరిగిన సెమీ ఫైనల్స్‌లో వెస్టిండీస్‌ను పాకిస్థాన్‌, ఆస్ట్రేలియాను ఇండియా ఓడించి.. ఫైనల్‌కు దూసుకెళ్లాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు కూడా కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లోనే తలపడతుండటంతో ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ఉండే క్రేజ్‌ మరింత పెరిగింది. మరి ఈ రోజు దాయాదుల మధ్య జరిగే ఫైనల్‌లో గెలిచి.. ఎవరు ఛాంపియన్స్‌ ఆఫ్‌ లెజెండ్స్‌గా నిలిచి కప్పు కైవసం చేసుకుంటారో చూడాలి. మరి ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments