Nidhan
ఉప్పల్ టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టుకు చుక్కలు చూపిస్తోంది భారత్. మన స్పిన్నర్ల దెబ్బకు స్టోక్స్ సేనకు మైండ్ బ్లాంక్ అయింది. ముఖ్యంగా అక్షర్ ఎంట్రీతో మ్యాచ్‌లో మొత్తం సీన్ మారిపోయింది.
ఉప్పల్ టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టుకు చుక్కలు చూపిస్తోంది భారత్. మన స్పిన్నర్ల దెబ్బకు స్టోక్స్ సేనకు మైండ్ బ్లాంక్ అయింది. ముఖ్యంగా అక్షర్ ఎంట్రీతో మ్యాచ్‌లో మొత్తం సీన్ మారిపోయింది.
Nidhan
అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. ఇదేంటి సాంగ్ పాడుతున్నారని అనుకుంటున్నారా? ఈ పాటలోని లిరిక్స్‌కు ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు న్యాయం చేస్తోంది. ఎన్నో ఆశలతో భారత గడ్డ మీదకు అడుగుపెట్టింది ఇంగ్లీష్ టీమ్. ఇక్కడ రెండో టెస్ట్ సిరీస్ విజయం కోసం బోలెడు ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చింది. మిగతా జట్ల మీదలాగే టీమిండియాను కూడా బజ్‌బాల్ క్రికెట్‌తో భయపెడదామని భావించింది. సిరీస్ స్టార్టింగ్‌కు ముందు ఇంగ్లండ్ మాజీలు, ప్రస్తుత జట్టులోని ప్లేయర్లు కూడా బజ్‌బాల్ నామం జపించారు. భారత్‌కు ఓటమి తప్పదని.. వేగంగా ఆడుతూ ఆ టీమ్‌కు తమ కొత్త ఫార్ములా రుచి చూపిస్తామని బడాయికి పోయారు. కానీ వాళ్ల ప్లాన్ అట్టర్‌ఫ్లాప్ అయింది. భారత స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లండ్ వణుకుతోంది. అపోజిషన్ టీమ్ జడేజా, అశ్విన్ కోసం ప్లాన్ చేసుకొని వస్తే అనూహ్యంగా అక్షర్ పటేల్ వాళ్లకు షాకులు ఇచ్చాడు.
తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను భయపెడుతున్నాడు అక్షర్ పటేల్. ఆ జట్టు ప్రధాన బ్యాటర్ జానీ బెయిర్‌స్టో (37)తో పాటు మంచి ఫామ్‌లో ఉన్న బెన్ ఫోక్స్ (4)ను అతడు వెనక్కి పంపాడు. ముఖ్యంగా బెయిర్‌స్టోను పంపిన డెలివరీ అయితే అద్భుతం. వేగంగా మిడ్ స్టంప్ మీద పడిన బంతి కాస్తా అనూహ్యంగా టర్న్ కావడంతో బెయిర్‌స్టోకు ఏం చేయాలో పాలుపోలేదు. అతడు డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించినా బ్యాట్‌ను దాటుకొని ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది బాల్. ఆ తర్వాత ఫోక్స్‌ను కూడా సూపర్బ్ డెలివరీతో పెవిలియన్‌కు దారి చూపించాడు అక్షర్. ఇవాళ మ్యాచ్‌లో అతడు వేసిన పేస్, క్విక్ టర్న్, వికెట్ టు వికెట్ బాల్స్ సాధారణంగా జడేజా వేస్తుంటాడు.
అసాధారణ ఆటగాళ్లు అయిన స్టీవ్ స్మిత్, బెయిర్‌స్టో లాంటి వారిని ఔట్ చేయాలంటే ఆ లెంగ్త్‌లో, అలా టర్న్ చేసే బంతులు వేయాలి. దీంట్లో జడ్డూ ఎక్స్పర్ట్. విచిత్రమైన బంతులతో స్మిత్, బెయిర్‌స్టో లాంటి టాప్ బ్యాటర్స్‌ను అతడు ఔట్ చేస్తుంటాడు. ఇంగ్లండ్ జట్టు కూడా జడేజా కోసం ఫుల్‌గా ప్రిపేర్ అయింది. అతడికి వికెట్లు ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఇంగ్లీష్ బ్యాటర్లు మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడారు. ఆ తర్వాత అటాక్ చేశారు. అయినా పిచ్, సిచ్యువేషన్‌కు తగ్గట్లుగా బౌలింగ్ చేసి ముగ్గుర్ని వెనక్కి పంపాడు జడ్డూ. అయితే క్రీజులో నిలదొక్కుకున్న బెయిర్‌స్టో ఔట్ కావడం లేదు. జడేజాతో పాటు అశ్విన్ బౌలింగ్‌లోనూ వరుసగా బౌండరీలు కొట్టాడు. కానీ అతడ్ని ఓ మ్యాజికల్ డెలివరీతో ఔట్ చేశాడు అక్షర్.
ఆ బాల్ అంత క్విక్‌గా పడి అనూహ్యంగా టర్న్ అవుతుందని ఊహించని బెయిర్‌స్టో బౌల్డ్ కావడంతో బిత్తరపోయాడు. అతడు కూడా జడ్డూ కోసం ప్రిపేర్ అయ్యాడు. కానీ అక్షర్ నుంచి సడన్‌గా విచిత్రమైన బంతి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడే కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్లానింగ్ వర్కౌట్ అయిందని చెప్పాలి. అక్షర్‌ను అతడి బలంతో పాటు ఇతర వేరియేషన్స్‌ను కూడా వాళ్లు ప్రాక్టీస్ చేయించడం ఇంగ్లండ్‌కు సర్ప్రైజ్గా మారింది. వాళ్లు జడ్డూ కోసం ప్లాన్ చేస్తే అక్షర్ ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. ఈ సిరీస్‌లో అక్షర్ ఇంకెన్ని విచిత్రమైన బంతులు వేస్తాడో చూడాలి. మరి.. అక్షర్ బౌలింగ్, టీమిండియా స్ట్రాటజీపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A dream delivery by Axar Patel.pic.twitter.com/OJy3nszcdh
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 25, 2024