Nidhan
వైజాగ్ టెస్టులో గెలవడంతో ఫుల్ జోష్‌లో ఉంది టీమిండియా. ఈ తరుణంలో మన జట్టుకు సూపర్బ్ న్యూస్. అది విన్న ఫ్యాన్స్ మనల్ని ఎవడ్రా ఆపేదని అంటున్నారు.
వైజాగ్ టెస్టులో గెలవడంతో ఫుల్ జోష్‌లో ఉంది టీమిండియా. ఈ తరుణంలో మన జట్టుకు సూపర్బ్ న్యూస్. అది విన్న ఫ్యాన్స్ మనల్ని ఎవడ్రా ఆపేదని అంటున్నారు.
Nidhan
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలి టెస్టులో గెలుపునకు దగ్గరగా వచ్చి ఓటమిపాలైన భారత్ ఈసారి మాత్రం ఇంగ్లీష్ టీమ్‌ను వదల్లేదు. 106 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ నిర్దేశించిన 399 పరుగులను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 292 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తలో 3 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి 9 వికెట్లు పడగొట్టిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే సెకండ్ టెస్ట్ నెగ్గి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియాకు మరో గుడ్ న్యూస్. రోహిత్ సేన ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది.
ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకింది భారత్. ఈ టేబుల్లో ఆస్ట్రేలియా 66 పాయింట్లతో మొదటి ప్లేసులో ఉండగా.. భారత్ 38 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో సౌతాఫ్రికా (12), న్యూజిలాండ్ (12), బంగ్లాదేశ్ (12) ఉన్నాయి. ఇంగ్లండ్‌పై విక్టరీతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా నంబర్ 2కు చేరుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన టీమ్‌ను ఆపడం ఎవరి తరం కాదని.. రోహిత్ సేన పవర్ ఇదని అంటున్నారు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అవ్వాలంటే ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టుల్లోనూ భారత్ నెగ్గాల్సి ఉంటుంది. అప్పుడే నంబర్ వన్ ర్యాంక్ సొంతమవుతుంది. సొంతగడ్డపై జరిగే మ్యాచుల్లో నెగ్గితే విదేశాల్లో జరిగే టెస్టుల సమయంలో టీమ్‌పై అంత ఒత్తిడి ఉండదని అనలిస్టులు అంటున్నారు.
ఇక, వైజాగ్ టెస్టులో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్‌కు చావుదెబ్బ కొట్టింది. వాళ్ల బజ్‌బాల్ క్రికెట్‌కు తొలి ఇన్నింగ్స్‌లో యష్బాల్ను కౌంటర్‌గా వాడింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో ఇంగ్లీష్ టీమ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో విధ్వంసం సృష్టించాడు. అతడి ధాటికి ఆ జట్టుకు 255 పరుగులకే కుప్పకూలింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్‌ను త్వరగా ఆలౌట్ చేసి గెలుద్దామనుకున్న ఇంగ్లండ్ ఆశలపై శుబ్‌మన్ గిల్ నీళ్లు పోశాడు. అతడు సెంచరీతో చెలరేగి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. 398 పరుగుల బిగ్ ఛేజింగ్‌కు దిగిన స్టోక్స్ సేన 600 స్కోరైనా సరే చేరుకుంటామని బీరాలు పోయింది. కానీ అశ్విన్, బుమ్రా చెరో 3 వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్‌ను 292 పరుగులు దాటనివ్వలేదు. మరి.. భారత్ టెస్టు ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
India back in Top 2. 🇮🇳
– The dream for WTC 2025 is on. pic.twitter.com/3N7sUDbIJD
— Johns. (@CricCrazyJohns) February 5, 2024