టీమిండియాలో మహ్మద్ షమీకి అసలైన వారసుడు అతడే..: అశ్విన్

  • Author singhj Published - 01:26 PM, Sun - 26 November 23

టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి వారసుడు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రియాక్ట్ అయ్యాడు.

టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి వారసుడు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రియాక్ట్ అయ్యాడు.

  • Author singhj Published - 01:26 PM, Sun - 26 November 23

వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్​లో ఓడినప్పటికీ భారత జట్టు తమ ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకుంది. మెగా టోర్నీలో బ్యాటింగ్​, బౌలింగ్, ఫీల్డింగ్​లో అద్భుతంగా రాణించి సత్తా చాటింది. ముఖ్యంగా టోర్నమెంట్​లో 10 వరుస విజయాలు సాధించడంలో టీమిండియా బౌలింగ్ యూనిట్ రోల్ ఎంతగానో ఉంది. అపోజిషన్ టీమ్స్​ను పేస్ అటాక్​తో ముప్పుతిప్పలు పెడుతూ, స్పిన్​తో తిప్పేస్తూ పోయించారు. సీనియర్ పేసర్ మహ్మద్ షమి బౌలింగ్​ను ఫేస్ చేయాలంటేనే ప్రత్యర్థి బ్యాటర్లు వణికిపోయారు. కచ్చితమైన పేస్, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్, లేట్ స్వింగ్​తో బ్యాట్స్​మెన్​ను భయపెట్టాడు షమి. టోర్నీ మొత్తం మీద అతడు 24 వికెట్లు తీశాడు. దీన్ని బట్టే ఈ పేసర్ బౌలింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

మెగా టోర్నీలో షమి బౌలింగ్​కు వస్తున్నాడంటే ప్రత్యర్థి టీమ్ బ్యాటర్లు ఎలా ఆడాలో తెలియక తికమకపడ్డారు. అతడి లాంటి బౌలర్లు మరింత మంది ఫ్యూచర్​లో టీమిండియాకు ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో షమీని సరైన వారసుడు ఎవరనే చర్చ కూడా మొదలైంది. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న యంగ్ పేసర్ మహ్మద్ సిరాజ్​కు ఆ సత్తా ఉందని కొందరు అనలిస్టులు అంటున్నారు. తన బౌలింగ్​ను మరింత మెరుగుపర్చుకొని రివర్స్ స్వింగ్​ చేసే ఎబిలిటీస్​ను పెంచుకుంటే సిరాజ్ మరో షమి అవుతాడని చెబుతున్నారు. అయితే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం సిరాజ్ కాదు.. షమీకి అసలైన వారసుడు మరొకరు ఉన్నారని అంటున్నాడు.

సిరాజ్ జూనియర్ షమి అవుతాడని అనుకున్నా. కానీ ఇప్పుడు యంగ్ పేసర్ ముఖేష్ కుమార్​ను చూస్తే షమీకి అతడే అసలైన వారసుడు అవుతాడని అనిపిస్తోంది. మహ్మద్ షమీని అందరూ ముద్దుగా ‘లాలా’ అని పిలుస్తారు. అయితే నేను మాత్రం అతడ్ని లాలెట్టన్ అని అంటా. ఎందుకుంటే నాకెంతో ఇష్టమైన యాక్టర్ మోహన్ లాల్ ముద్దుపేరు లాలెట్టన్. ఇక, ముకేష్ బౌలింగ్ యాక్షన్ అచ్చం షమీని పోలి ఉంది. వీళ్లిద్దరూ దాదాపుగా సమానమైన ఎత్తులో ఉంటారు. షమీలాగే ముకేష్ అద్భుతంగా యార్కర్లు వేయగలడు. బాల్​ మీద మంచి కంట్రోల్, ఫెంటాస్టిక్ బ్యాక్ స్పిన్ కలిగి ఉన్నాడు. వెస్టిండీస్​తో సిరీస్​లోనూ అతడు బాగా బౌలింగ్ చేశాడు’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

ఇక, ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ టీ20లో ముకేష్ కుమార్ తన బౌలింగ్ స్కిల్స్​తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్​లో అతడు వికెట్లేమీ తీయకున్నా.. ఆఖరి ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. స్టొయినిస్, డేవిడ్ లాంటి హార్డ్ హిట్టర్లను భారీ షాట్స్ కొట్టకుండా అడ్డుకున్నాడు. ఆ ఇన్నింగ్స్​లో చివరి ఓవర్ వేసిన ముకేష్ 5 పరుగులు మాత్రమే ఇచ్చి కంగారూల జోరుకు కళ్లెం వేశాడు. అతడి బౌన్సర్లు, యార్కర్లకు ఆసీస్ బ్యాటర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఓవరాల్​గా మొదటి టీ20లో 4 ఓవర్లు వేసిన ముకేష్.. 29 రన్స్ మాత్రమే ఇచ్చాడు. తిరువనంతపురం వేదికగా ఆదివారం జరిగే రెండో టీ20లోనూ సత్తా చాటాలని ముకేష్ భావిస్తున్నాడు. మరి.. ముకేషే జూనియర్ షమి అంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: గొప్ప మనసు.. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన షమీ! వైరల్ వీడియో..

Show comments