భారత్-ఆసీస్ మ్యాచ్​కు వాన గండం.. ఒకవేళ మ్యాచ్ రద్దయితే పరిస్థితేంటి?

ఆస్ట్రేలియాతో సూపర్ ఫైట్​కు సిద్ధమవుతోంది టీమిండియా. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది రోహిత్ సేన. అయితే వాన రూపంలో ఈ మ్యాచ్​కు గండం పొంచి ఉంది.

ఆస్ట్రేలియాతో సూపర్ ఫైట్​కు సిద్ధమవుతోంది టీమిండియా. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది రోహిత్ సేన. అయితే వాన రూపంలో ఈ మ్యాచ్​కు గండం పొంచి ఉంది.

పొట్టి కప్పులో అసలైన పోరాటానికి రంగం సిద్ధమైంది. రెండు హేమాహేమీ జట్ల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్​కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. టోర్నీ ఫేవరెట్స్ అయిన భారత్, ఆస్ట్రేలియా ఇవాళ తాడోపేడో తేల్చుకోనున్నాయి. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన సిచ్యువేషన్​లో ఉంది కంగారూ టీమ్. దీంతో ఆ జట్టు ఎప్పుడూ లేనంత ప్రెజర్​ను ఫేస్ చేస్తోంది. మరోవైపు ఆసీస్​ చేతుల్లో ఓడినా సెమీస్ బెర్త్ దక్కుతుంది కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగనుంది రోహిత్ సేన. అయితే భారీ తేడాతో ఓడితే క్వాలిఫికేషన్ కష్టంగా మారుతుంది. అందుకే లైట్ తీసుకోకుండా కంగారూల పని పట్టాలని చూస్తోంది. అదే టైమ్​లో వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్​లో ఓటమికి పగ తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. దీంతో ఇవాళ టఫ్ ఫైట్ తప్పేలా లేదు.

గెలుపే మంత్రంగా ఇరు టీమ్స్ బరిలోకి దిగుతాయి. కాబట్టి ఇవాళ గ్రౌండ్​ యుద్ధభూమిని తలపించేలా ఉంది. ఈ మ్యాచ్​ ఆఖరి బాల్​ వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు జట్లు బలంగా ఉండటం, ఓటమిని ఒప్పుకోని తత్వానికి అలవాటు పడినవి కావడంతో లాస్ట్ మూమెంట్ వరకు పోరాడతాయి. అందుకే ఈ మ్యాచ్ కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వాన రూపంలో ఈ మ్యాచ్​కు గండం పొంచి ఉంది. ఈ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న సెయింట్ లూసియాలో ఇప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మ్యాచ్ జరిగే ఏరియాలో ఈ రోజంతా వాన కురిసే ఛాన్స్ ఉందని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది. పొద్దున పూట వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. పూర్తి మ్యాచ్ జరగడం కష్టమేనని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

వాన ఆగకుండా పడితే మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ మ్యాచ్ రద్దయితే భారత్​కు ప్లస్సా.. మైనస్సా? అనేది ఇప్పడు తెలుసుకుందాం.. భారత జట్టు సూపర్-8లో ఇప్పటికే రెండు విజయాలతో దాదాపుగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఒకవేళ నేటి మ్యాచ్ రద్దయితే ఆస్ట్రేలియా, టీమిండియాకు చెరో పాయింట్ దక్కుతుంది. అప్పుడు 5 పాయింట్లతో మెన్ ఇన్ బ్లూ సెమీస్​కు చేరుతుంది. మూడు పాయింట్లకు చేరే కంగారూ టీమ్​కు సెమీస్ చేరే ఛాన్సులు ఉంటాయి. అయితే బంగ్లాదేశ్-ఆఫ్ఘానిస్థాన్ మ్యాచ్ రిజల్ట్​ మీద అది డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఆఫ్ఘాన్​ను బంగ్లా ఓడిస్తే ఆస్ట్రేలియా సెమీస్​కు చేరుతుంది. అదే ఆఫ్ఘాన్ గెలిస్తే ఆసీస్ ఇంటిదారి పడుతుంది. ఇవాళ మ్యాచ్ జరిగి ఆసీస్ ఓడినా నాకౌట్​కు చేరేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇది సాధ్యపడాలంటే ఆఫ్ఘాన్ తమ లాస్ట్ మ్యాచ్​లో ఓడిపోవాలి. ఎలా చూసినా మ్యాచ్ రద్దు అనేది భారత్​కు మంచే చేస్తుంది. మ్యాచ్ రద్దయితే రోహిత్ సేన సెమీస్​కు దూసుకెళ్తుంది. కానీ మ్యాచ్ జరగకపోతే ఆసీస్ క్వాలిఫికేషన్ మరింత కష్టంగా మారుతుంది.

Show comments